APSRTC: నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15ని చివరి తేదీగా నిర్ణయించారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (APSRTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 10 విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు పలు విభాగాల్లో శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో స్టైఫండ్ సైతం అందిస్తారు. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుతో పాటు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికేట్, ఐటీఐ మార్క్‌ల షీట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఒక వేళ వికలాంగులు అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫిటెట్స్‌ను అందజేయాల్సి ఉంటుంది. ముందుగా ఆన్ లైన్ లో ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకొని. అభ్యర్థి వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం ఫామ్ తో పాటు, సంబంధింత సర్టిఫికేట్లను జోడించి అందజేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 118 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విజయనగరంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఈ నెల 18,19,21 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన వారికి 21వ తేదీన, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన వారికి 18వ తేదీన, విశాఖపట్నం, అనకాపల్లి, సీతారామరాజు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు 19 తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను ఆర్టీసీ, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, విజయనగరంలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..