NEET Exam Twice A Year: ‘నీట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే ప్రతిపాదనేదీ లేదు’ కేంద్ర మంత్రి

నీట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే ప్రతిపాదనేదీ లేదని జాతీయ మెడికల్‌ కమిషన్‌ తేల్చి చెప్పినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ బదులిస్తూ.. నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పదేళ్లలో మూడు రెట్లు పెరిగిందన్నారు. 2014లో 6,58,040 మంది విద్యార్ధులు నీట్‌కు హాజరయ్యారు. 2023లో దాదాపు 20,38,597 మంది పరీక్ష..

NEET Exam Twice A Year: 'నీట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే ప్రతిపాదనేదీ లేదు' కేంద్ర మంత్రి
NEET Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 08, 2023 | 3:02 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 8: నీట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహించే ప్రతిపాదనేదీ లేదని జాతీయ మెడికల్‌ కమిషన్‌ తేల్చి చెప్పినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ బదులిస్తూ.. నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పదేళ్లలో మూడు రెట్లు పెరిగిందన్నారు. 2014లో 6,58,040 మంది విద్యార్ధులు నీట్‌కు హాజరయ్యారు. 2023లో దాదాపు 20,38,597 మంది పరీక్ష రాశారు. 2019-23 మధ్యకాలంలో ఏపీకి చెందిన విద్యార్ధులు 2,89,272 మంది, తెలంగాణ నుంచి 2,72,172 మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాసినట్లు వెల్లడించారు.

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఆగస్ట్‌ 9న కౌన్సెలింగ్‌

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ పాలిటెక్నిక్‌, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు, మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఆగ‌స్టు 9న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటరమణ వెల్లడించారు. ఆయా సీట్లకు యూనివర్సిటీ ఆడిటోరియంలో నేరుగా కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో  చెక్‌ చేసుకోవచ్చన్నారు.

తెలంగాణ స్టాఫ్‌ నర్సుల నియామక పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ఆగస్టు 2న రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నియామక పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆగ‌స్టు 7న విడుదల చేసింది. ఆగ‌స్టు 2న పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆగ‌స్టు 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను పంపించాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆన్సర్‌ కీపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత పైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.