BARC Recruitment 2023: భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూకి హాజరైతే జాబ్‌ మీదే

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ డీఎం/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వయసు 25 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు..

BARC Recruitment 2023: భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూకి హాజరైతే జాబ్‌ మీదే
BARC Mumbai
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 07, 2023 | 9:55 PM

భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. 32 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జీడీఎంఓ, థెరపిస్ట్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, ఇంటెన్సివిస్ట్‌, ఆడియోలజీ అండ్‌ స్పీచ్‌ థెరపిస్ట్, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, జనరల్ ఫిజిషియన్‌, ఆప్తమాలజిస్ట్, ఆర్దోడిక్‌, న్యూరాలజిస్ట్‌, గ్యాస్ట్రోఎంటీరియాలజిస్ట్, నియోనాటాలజిస్ట్‌, ఎండోడొంటిస్ట్‌, ఓరల్‌ మ్యాక్సిలోఫేషియల్‌ సర్జన్‌, రేడియోలజిస్ట్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ డీఎం/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వయసు 25 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ అడ్రస్..

గ్రౌండ్‌ఫ్లోర్‌ కాన్ఫరెన్స్‌ రూం నం.1, బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) హాస్పటల్‌, అణుశక్తినగర్‌, ముంబయి-400094.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

బెల్‌-పుణెలో 10 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)..ఫిట్టర్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 10లను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ డిప్లొమాలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 28, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.295 అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,500 నుంచి రూ.90,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.