Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SI Mains Exam: డిజిటల్‌ మీటర్‌తో ఎత్తు కొలవడంపై హైకోర్టులో ఎస్సై అభ్యర్థుల పిటిషన్‌.. నేడు ముగిసిన వాదనలు

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్సై నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో తాము అనర్హులయ్యామంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. డిజిటల్‌ విధానంలో కాకుండా మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసు నియామక మండలి (APSLPRB) ఆదేశించాలని అభ్యర్ధించారు. ఈ పిటీషన్‌పై..

AP SI Mains Exam: డిజిటల్‌ మీటర్‌తో ఎత్తు కొలవడంపై హైకోర్టులో ఎస్సై అభ్యర్థుల పిటిషన్‌.. నేడు ముగిసిన వాదనలు
SI candidates filed petition in AP High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 12, 2023 | 9:12 PM

అమరావతి, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్సై నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో తాము అనర్హులయ్యామంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. డిజిటల్‌ విధానంలో కాకుండా మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసు నియామక మండలి (APSLPRB) ఆదేశించాలని అభ్యర్ధించారు. ఈ పిటీషన్‌పై గురువారం (అక్టోబర్‌ 12) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి సుజాత విచారణ జరిపారు. 2019లో నిర్వహించిన పరీక్షల్లో శారీరక కొలతల్లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన వాళ్లు ప్రస్తుతం డిజిటల్‌ మీటర్‌ను వినియోగించడంతో అనర్హులయ్యారన్నారని, డిజిటల్‌ విధానంలో అవకతకలు జరిగాయంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే తాము నిబంధనల మేరకే కొలతలు స్వీకరించామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి APSLPRB ఇటీవల శారీరక కొలతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు గానూ డిజిటల్‌ పరకరాలను వినియోగించారు. దీంతో పలువురు అభ్యర్ధులు అనర్హులుగా తేలారు. గతంలో పోలీస్‌ నియామకాలకు పోటీ చేసినప్పుడు నిర్వహించిన కొలతల్లో అర్హత సాధించిన తాము.. ఇప్పుడెలా అనర్హులయ్యామంటూ కొందరు అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో వారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. నేడు పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం తీర్పులు రిజర్వులో ఉంచారు.

పీఎంటీ, పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌ 14, 15 తేదీల్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రక్రియ ముగియనుంది. ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 4 పేపర్లకు నిర్వహించనున్నారు. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, మిగతా రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌లో జరుగుతాయి. అక్టోబర్ 14వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. అక్టోబర్‌ 15వ తేదీన కూడా ఉదయం, మధ్యాహ్న సెషన్లలో ఆబ్జెక్టివ్ విధానంలో మిగతా రెండు పరీక్షలు నిర్వహిస్తారు. తాజాగా కోర్టులో ఎస్సై అభ్యర్థుల పిటిషన్‌ నేపథ్యంలో ఈపరీక్షలపై ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.