APRS CAT 2023 : ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 5వ, 6వ,7వ,8వ తరగతులో ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 ఏపీఆర్‌ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ) క్యాట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 ఏపీఆర్‌ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ) క్యాట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రకటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని బాలురు, బాలికలకు ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ) గురుకుల పాఠశాల్లో ఉచిత విద్య, వసతికల్పిస్తారు. ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
సీట్ల సంఖ్య..
- రాష్ట్రంలోని 12 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు (బాలురు, బాలికలు): 920
- రాష్ట్రంలోని 12 గురుకుల పాఠశాలల్లో 6వ, 7వ, 8వ తరగతుల్లో సీట్లు (బాలురు, బాలికలు): 1145
అర్హతలు..
2022-2023 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకుండా ఉండాలి. మైనార్టీ, పీహెచ్‌సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూన్ 30, 2023లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.