Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: పుచ్చకాయ కొనేముందు సహజంగా పండిందో.. లేదో.. ఇలా తెలుసుకోండి

వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. దీనిలో 90 శాతం నీరు ఉండటమేకాకుండా వేసవి తాపాన్ని తొలగించి, సత్వర శక్తిని అందిస్తుంది. ఐతే పుచ్చకాయలను ఎలా కొనాలి? దీనిని చాక్‌తో కట్ చేయకుండానే అది పండిందో.. లేదో ? తెలుసుకోవడం ఎలా..? వంటి సందేహాలు..

Watermelon: పుచ్చకాయ కొనేముందు సహజంగా పండిందో.. లేదో.. ఇలా తెలుసుకోండి
Watermelon
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2023 | 2:08 PM

వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. దీనిలో 90 శాతం నీరు ఉండటమేకాకుండా వేసవి తాపాన్ని తొలగించి, సత్వర శక్తిని అందిస్తుంది. ఐతే పుచ్చకాయలను ఎలా కొనాలి? దీనిని చాక్‌తో కట్ చేయకుండానే అది పండిందో.. లేదో ? తెలుసుకోవడం ఎలా..? హార్మోన్‌ ఇంజక్షన్‌ వల్ల పండిందా లేదా సహజంగానే పండిందా వంటి సందేహాలు మనలో చాలా మందికి లేకపోలేదు. సరైన అవగాహన లేకుండానే తికమకపడిపోతూ కంటికి అందంగా కనిపించిన దానిని సెలెక్ట్‌ చేసుకుంటాం. ఆనక ఇంటికి వచ్చి కట్‌ చేశాక మోసపోయామని నాలుక కరచుకుంటాం. అందుకే ఈ కింది టిప్స్‌ ఫాల్ఓ అవ్వండి..

ఎలా గుర్తించాలంటే..

  • పరిమాణంలో చిన్నగా ఉండే పుచ్చకాయలు తియ్యగా, ఎర్రగా ఉంటాయి.
  • పుచ్చకాయ పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి.
  • పూర్తిగా పండిన పుచ్చకాయలు ముదురు పచ్చ రంగులో ఉంటాయి.
  • పుచ్చకాయలో పసుపు రంగు మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే, అది ఎర్రగా, తియ్యగా ఉంటుంది.
  • పుచ్చకాయను వేలితో కొట్టినప్పుడు శబ్దం ఎక్కువగా వస్తే అది పండిందని అర్ధం. తక్కువ శబ్దం వస్తే అది ఇంకా పండలేదని సంకేతం.
  • పండిన పుచ్చకాయ‌ను ముక్కు ద‌గ్గర పెట్టుకుంటే తియ్యటి వాస‌న వస్తుంది. పచ్చికాయక అలా రాదు.
  • ఈ రోజుల్లో పుచ్చకాయలు త్వరగా పక్వానికి రావడానికి, ఎర్రగా మారడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తున్నారు.ఇలాంటివి ఆరోగ్యానికి చాలా హానికరం. పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, దానిలో రంధ్రాలు లేదా పగుళ్లు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
  • సహజంగా పండిన పుచ్చకాయను గుర్తించడానికి.. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని పుచ్చకాయ ముక్కను కట్ చేసి నీళ్లలో వేయాలి. నీళ్లు రంగు మారడం ప్రారంభిస్తే, అది రసాయనాలతో పండిందని అర్ధం. సహజంగా పండిన పుచ్చకాయ ఎప్పుడూ రంగు మారదు.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
'నీకు చేతనైనది చేసుకో..': పీఓకే ప్రధాని అన్వరుల్
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
పల్లీలు, నువ్వులు కలిపి తింటున్నారా..? మీ శరీరంలో కలిగే మార్పులు
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డు కానీ.. ప్రవర్తనపై విమర్శల వర్షం
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డు కానీ.. ప్రవర్తనపై విమర్శల వర్షం
రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె దుస్తులు విప్పేశాడు.. కట్ చేస్తే..
రొమాన్స్ చేస్తున్నట్లు ఆమె దుస్తులు విప్పేశాడు.. కట్ చేస్తే..
పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
పాపం! ఎలాంటి డైరెక్టర్‌.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
విరేచనాలు తగ్గడానికి ఇలా చేసి చూడండి..!
విరేచనాలు తగ్గడానికి ఇలా చేసి చూడండి..!