AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC FBO 2025 Exam Date: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌ ఆఫీసర్‌ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను..

APPSC FBO 2025 Exam Date: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌ ఆఫీసర్‌ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
APPSC Forest Beat Officer Exam Date
Srilakshmi C
|

Updated on: Jul 18, 2025 | 6:28 AM

Share

అమరావతి, జులై 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. రాత పరీక్షను సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానంలో అంటే పెన్‌, పేపర్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్‌ బేస్డ్‌), మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌, నడక / మెడికల్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియేన్సీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ సెప్టెంబర్‌ 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 5, 2025వ తేదీతో దరఖాస్తులు ముగుస్తాయి. జనరల్‌ అభ్యర్ధులు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.80 కలిపి మొత్తం 330 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌, నిరుద్యోగ యువత తదితరులకు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250 మాత్రమే చెల్లించాలి. వీరికి ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.80 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది. స్ట్రీ, పురుష అభ్యర్థులు ఎవరైనా పోటీ పడవచ్చు. అయితే పురుష అభ్యర్ధులు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలు కనీసం 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు కలుస్తాయి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ రాత పరీక్ష షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే