AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT IIIT Admissions 2023: అక్టోబర్‌ 12 నుంచి ఏపీ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌.. ఫీజులు ఎలా ఉంటాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలకు..

AP RGUKT IIIT Admissions 2023: అక్టోబర్‌ 12 నుంచి ఏపీ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌.. ఫీజులు ఎలా ఉంటాయంటే..
AP RGUKT IIIT Admission 2022-23
Srilakshmi C
|

Updated on: Oct 10, 2022 | 6:06 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలకు సెలక్షన్‌ లిస్టు విడుదల చేసింది. వీరికి అక్టోబర్‌ 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబ‌రు 12-13 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయలో, 14-15 తేదీల్లో ఒంగోలు ప్రాంగణానికి సంబంధించి ఇడుపులపాయలో, 15-16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఎచ్చెర్లలో జరుగనుంది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు జారీ చేసిన మార్కుల షీటు, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్‌, విద్యార్ధికి సంబంధించిన లేటెస్ట్ పాస్‌ పోర్ట్‌ ఫొటోలు తదితర సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది.

ఫీజులు ఎలా ఉంటాయంటే..

జగనన్న విద్య, వసతి దీవెన పథకాలకు అర్హతలేని విద్యార్థులు పీయూసీలో ప్రవేశం పొందితే ఏడాదికి రూ.45 వేలు, ఇంజినీరింగ్‌లో సంవత్సరానికి రూ.50 వేల చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. మెస్‌ ఛార్జీలు నెలకు రూ.2,500 నుంచి రూ.3000 వరకు ఉంటాయి. ప్రవేశ రుసుము రూ.1000, (ఎస్సీ, ఎస్టీలు రూ.500), గ్రూపు బీమా కింద రూ.1,200, కాషన్‌ డిపాజిట్‌ రూ.1000 (ఇది ఆఖరులో అభ్యర్థికి తిరిగి చెల్లిస్తారు), అకామడేషన్‌ మేనేజ్‌మెంట్‌ కింద రూ.1000లు ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.