AP Polycet Result 2022: నేడే ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు.. మీ రిజల్ట్స్‌ని ఇక్కడ చెక్ చేసుకోండి..!
AP Polycet Result 2022: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాల శిక్షణ శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ..
AP Polycet Result 2022: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాల శిక్షణ శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారు. శనివారం ఉదయం 9.15గంటలకు మంత్రి ఫలితాలు విడుదల చేస్తారని సాంకేతిక విద్య కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో పాలిసెట్ ఎగ్జామ్‌ను మే 29న నిర్వహించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు జూన్ 17వ తేదీనే విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, అదికాస్తా మరుసటి రోజుకు వాయిదా పడింది. అంటే ఇవాళ విడుదల చేయనున్నారు. ఇక ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. వీరంతా AP Polycet Results 2022 కోసం ఎదురుచూస్తున్నారు.
పాలిసెట్ పరీక్ష ఫలితాల కోసం ఈ లింక్ (AP Polycet Results 2022) క్లిక్ చేయండి..