AP TET (July) Syllabus: ఏపీ టెట్ (జులై) 2024 సిలబస్‌పై అభ్యర్ధుల్లో గందరగోళం.. విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) నిర్వహణకు నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కంటే ముందుగా మరొకమారు టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన కూటమి సర్కార్.. చెప్పిన మాట ప్రకారంగానే టెట్‌ (జులై) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్‌, షెడ్యూల్, సిలబస్ వంటి తదితర..

AP TET (July) Syllabus: ఏపీ టెట్ (జులై) 2024 సిలబస్‌పై అభ్యర్ధుల్లో గందరగోళం.. విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ
AP TET (July) Syllabus
Follow us

|

Updated on: Jul 03, 2024 | 3:10 PM

అమరావతి, జులై 3: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) నిర్వహణకు నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కంటే ముందుగా మరొకమారు టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన కూటమి సర్కార్.. చెప్పిన మాట ప్రకారంగానే టెట్‌ (జులై) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్‌, షెడ్యూల్, సిలబస్ వంటి తదితర వివరాలు కూడా ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపులకు అవాకాశం కల్పించామని, రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు.

అయితే, టెట్‌ (జులై) పరీక్షకు సంబంధించి సిలబస్‌ విషయమై అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఆగస్టులో నిర్వహించే టెట్‌ పరీక్షలకు పాత సిలబస్ ప్రకారంగా ప్రశ్నాపత్రం తయారు చేయనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇది వాస్తవం కాదని కొట్టిపారేశారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని ఆయన సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌ పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌నే ప్రస్తుత టెట్‌ పరీక్షకు కూడా నిర్థారించినట్లు ఆయన స్పష్టం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2024 సిలబస్‌ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

టెట్‌ అధికారిక వెబ్‌సైట్లో కూడా దాన్నే అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని, సోషల్‌ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో టెట్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉండగా.. ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు జరగనున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు