AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2024: ‘గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు’ మంత్రి నారా లోకేశ్‌

గా డీఎస్సీ, టెట్‌ పరీక్షలకు సంబంధించి మంత్రి నారా లోకేష్‌ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. బదులుగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే రద్దైన గత డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌..

AP Mega DSC 2024: 'గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు' మంత్రి నారా లోకేశ్‌
Minister Lokesh review on DSC and TET
Srilakshmi C
|

Updated on: Jul 03, 2024 | 3:41 PM

Share

అమరావతి, జులై 3: మెగా డీఎస్సీ, టెట్‌ పరీక్షలకు సంబంధించి మంత్రి నారా లోకేష్‌ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను చంద్రబాబు సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. బదులుగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే రద్దైన గత డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌ నిర్ణయించారు. వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం టెట్‌, డీఎస్సీ నిర్వహణపై అధికారులతో జరిపిన సమీక్షలో పేర్కొన్నారు.

టెట్‌కు మెగా డీఎస్సీకి మధ్య ప్రిపరేషకు ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. డీఎస్సీ నిర్వహణకు అభ్యర్థులు, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆయన అన్నారు. అలాగే పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీఓ – 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి, వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

మరోవైపు మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపుపై కూడా మంత్రి లోకేష్‌ అధికారులతో చర్చలు జరిపారు. దీనిపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జీటీ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించారు. దీనికి అధికారులు సమాధానం ఇస్తూ.. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు. అలాగే అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్‌ ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలి అన్న దానిపై కూడా తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆయన అన్నారు. టెట్‌ సిలబస్‌లో మార్పు చేయలేదని, ఫిబ్రవరిలో ఇచ్చిన సిలబస్‌న్‌ కొనసాగిస్తున్నామని, ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు మంత్రి లోకేష్‌కు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.