AP EAPCET 2024 Notification: ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్చి 11 (సోమవారం) ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఈఏపీసెట్ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో..
అమరావతి, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్చి 11 (సోమవారం) ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఈఏపీసెట్ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు ఇవే…
- ఏపీ ఈఏపీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చి 11, 2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 12, 2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 15, 2024.
- ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు: మే 13 నంచి 19 వరకు, 2024.
కేవలం 3 నెలల్లో 28,942 ఉద్యోగాల భర్తీ చేశాం: ప్రభుత్వానికి టీఎస్‌పీఎస్సీ నివేదిక
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన మూడు నెలల్లో రాష్ట్రంలో మొత్తం 28,942 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వానికి నివేదించింది. మొత్తం నియామకాల్లో పురుషులు 53 శాతం, మహిళలు 47 శాతం ఉద్యోగాలు సాధించినట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో 33 శాతం మహిళల కోటా రిజర్వేషన్లు దక్కాలని బీఆర్‌ఎస్ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టీఎస్పీయస్సీ ఈ మేరకు గత మూడు నెలల్లో చేపట్టిన నియామకాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో 33 శాతం కంటే అధికంగానే మహిళలు ఉద్యోగ నియామకాలు పొందినట్లు స్పష్టం చేసింది. గత నియామకాల్లో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు సూచనల మేరకు 2022 లోనే ప్రభుత్వం 7593 మెమో జారీ చేసింది. అందులో ఉన్న నిబంధనల మేరకు జీవో నం.3 జారీ చేసినట్లు ప్రభుత్వం వివరించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.