AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఆవుపేడతో ఏటా లక్షల్లో ఆదాయం.. శ్రమతో పాటు ఆదాయం కూడా ఎక్కువే..!

జీవితంలోని ప్రతి మలుపులో మన శ్రమతో పాటు ఆలోచన ద్వారా కొత్త దిశను కనుగొనాలని యువత అనుకుటుంది. ఒకరి కింద పని చేయకుండా తమ సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారు ఎక్కువయ్యారు. ఇలాంటి వారే ఇండోర్‌కు చెందిన ఏక్తా మెహతా అనే మహిళ. తన అద్వితీయమైన ఆలోచన, శ్రమతో ఆవు పేడతో గృహాలంకరణ రంగంలో కొత్త మైలు రాయిను అందుకుంది. ఆవు పేడను వివిధ రంగుల్లో అందంగా అలంకరించి చిన్నా పెద్దా ఆకృతుల్లో అమర్చి ఇంటి అలంకరించే వస్తువులుగా మార్చింది.

Business Idea: ఆవుపేడతో ఏటా లక్షల్లో ఆదాయం.. శ్రమతో పాటు ఆదాయం కూడా ఎక్కువే..!
Cow Dung
Nikhil
|

Updated on: Mar 15, 2024 | 6:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. జీవితంలోని ప్రతి మలుపులో మన శ్రమతో పాటు ఆలోచన ద్వారా కొత్త దిశను కనుగొనాలని యువత అనుకుటుంది. ఒకరి కింద పని చేయకుండా తమ సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారు ఎక్కువయ్యారు. ఇలాంటి వారే ఇండోర్‌కు చెందిన ఏక్తా మెహతా అనే మహిళ. తన అద్వితీయమైన ఆలోచన, శ్రమతో ఆవు పేడతో గృహాలంకరణ రంగంలో కొత్త మైలు రాయిను అందుకుంది. ఆవు పేడను వివిధ రంగుల్లో అందంగా అలంకరించి చిన్నా పెద్దా ఆకృతుల్లో అమర్చి ఇంటి అలంకరించే వస్తువులుగా మార్చింది. ఆమె పని కొత్త శైలిని అందించడమే కాకుండా ఈ రోజు చాలా మంది మహిళలకు కొత్త ఉపాధి మార్గాలను కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆవుపేడతో ఎలాంటి అలంకరణ సామగ్రి తయారు చేశారో? ఓసారి తెలుసుకుందాం.

పాలు ఇచ్చే ఆవులను బాగా చూసుకుంటానని ఏక్తా మెహతా చెప్పారు. పాలు ఇవ్వని ఆవులను చాలా మంది వదిలేస్తారు. అయితే ఈ ఆవులతో కూడా ఆదాయాన్ని పొందవచ్చని ఆమె చెబతున్నారు. ముఖ్యంగా ఆవు పేడతో ఇంటి అలంకరణ వస్తువులను ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించి, గోశాల నుండి ఆవు పేడను కొనడం ప్రారంభించాం. అనంతరం మాకు డబ్బు సంపాదించడానికి సహాయపడింది ఆమె వివరించింది. ఏక్తా మెహతా వద్ద 10 మంది మహిళల బృందం ఉంది. ఈ గ్రూప్ పేరు ఏక్తా సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని ఏక్తా చెప్పారు. 

అలాగే ఏక్తా మెహతా గ్రామాలకు వెళ్లి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఉపాధి మార్గం కల్పించడం ద్వారా వారికి కొంత డబ్బు వస్తుంది. గుజరాత్ నుంచి ఖజురహో వరకు అనేక గిరిజన ప్రాంతాలకు వెళ్లామని ఏక్తా మెహతా చెబుతున్నారు.  ఆవు పేడతో గృహాలంకరణ వస్తువులను ఎలా తయారు చేయాలో? మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఆవు పేడతో తయారు చేసిన గృహాలంకరణ వస్తువులు భారతదేశం అంతటా అమ్ముడవుతున్నాయని ప్రజలు వాటిని బాగా ఇష్టపడుతున్నారని ఏక్తా చెప్పారు. కొన్ని నెలల్లో రూ.50వేలు, మరికొన్ని నెలల్లో రూ.50వేలకు పైగా ఆదాయం వస్తోందన్నారు. భారతీయులు చైనాలో తయారయ్యే రసాయన ఉత్పత్తులను వదిలిపెట్టి మన భారతీయ సంస్కృతిని, ఆవు పేడతో తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నదే మా లక్ష్యమని ఏక్తా మెహతా చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.