AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Library Science Admissions: రేపట్నుంచి లైబ్రరీ సైన్సు కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం.. ఎవరు అర్హులంటే?

రాష్ట్రంలోని లైబ్రరీ సైన్సు కోర్సులో ప్రవేశాలకు పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది..

Library Science Admissions: రేపట్నుంచి లైబ్రరీ సైన్సు కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం.. ఎవరు అర్హులంటే?
Library Science Admissions
Srilakshmi C
|

Updated on: Oct 30, 2024 | 8:40 AM

Share

అమరావతి, అక్టోబర్ 30: రాష్ట్రంలోని పలు కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి లైబ్రరీ సైన్సు సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ ఓ ప్రకనలో తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ నవంబరు ఒకటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్‌ 18న సాయంత్రం 5గంటలలోపు సమర్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మొత్తం 40 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. పీఎన్‌ స్కూల్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్సు-విజయవాడ, రాయలసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్సు, గాంధీనగర్, కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్సు, అరండల్‌పేట, గుంటూరులలో ఈ సీట్లు ఖాళీగా ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో కలిసి 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఏదైనా యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సులో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన వారికి 5 మార్కులు, పీజీ అర్హతకి 10 మార్కులు అదనంగా ఇస్తారు. ప్రతి మాధ్యమంలో 10 శాతం సీట్లు జిల్లా గ్రంథాలయ సంస్థలు, ప్రభుత్వ గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయ సంచాలకుల కార్యాలయాల్లో పని చేసే అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.

టీజీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. కెమిస్ట్రీ, హిస్టరీ, హిస్టరీ ఉర్దూ మీడియం, ఫిజిక్స్, ఫిజిక్స్‌ ఉర్దూ మీడియం, సంస్కృతం బోధించే జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.