AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 3 Exam Schedule: తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్ధులకు బిగ్ అప్‌డేట్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ గ్రూప్ 3 పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. మరో పది రోజుల్లోనే హాల్ టికెట్లు విడుదల కానున్నాయి..

TGPSC Group 3 Exam Schedule: తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్ధులకు బిగ్ అప్‌డేట్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే
TGPSC Group 3 Exam Schedule
Srilakshmi C
|

Updated on: Oct 31, 2024 | 7:02 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చింది. గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) పూర్తి షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్‌ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 నిర్వహించనున్నారు. ఇక నవంబర్‌ 18వ తేదీన పేపర్‌ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు నవంబర్‌ 10వ తేదీన అందుబాటులోకి రానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 3 పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 సెలక్షన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, క్వశ్చన్‌పేపర్లు జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. తొలిరోజు పేపర్‌ 1 పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని కమిషన్‌ కార్యదర్శి డాక్టర్‌ ఇ నవీన్‌నికోలస్‌ తెలిపారు. పరీక్షల అనంతరం డూప్లికేట్‌ హాల్‌టికెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ జారీ చేయబోమని స్పష్టం చేసింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వర్కింగ్‌ డేస్‌లలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23542185, 040-23542187 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణలో మొత్తం 1380కి పైగా గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్ధులు హోరాహోరీగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్