AP Polycet 2024 Counselling: ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి తరగతులు

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపట్టనున్నారు. మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకకు అవకాశం కల్పించారు..

AP Polycet 2024 Counselling: ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి తరగతులు
AP Polycet 2024 Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2024 | 6:33 AM

అమరావతి, మే 22: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపట్టనున్నారు. మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకకు అవకాశం కల్పించారు. ఐచ్ఛికాలు మార్చుకునేందుకు మే 5వ తేదీలోనే వెసులుబాటు కల్పించారు. ఇక మే 7న సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 10 నుంచి 14 వరకు విద్యార్ధులు సీట్లు పొందిన కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. విద్యార్థులు సీటు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా లేదంటే ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కాగా ఈ ఏడాది పాలిసెట్‌ ఫలితాలు మే 8వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించారు. వీరిలో బాలికలు 50,710 (89.81 శాతం) మంది, బాలురు 73,720 (73.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది పాలీసెట్‌ ఉత్తీర్ణత 87.61 శాతం నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్‌ కేటగిరి, ఇతర అంశాల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీటు కేటాయిస్తారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
గేమ్ ఛేంజర్ సినిమా .. నటీనటుల పారితోషికాలు ఎంతంటే..
గేమ్ ఛేంజర్ సినిమా .. నటీనటుల పారితోషికాలు ఎంతంటే..
భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ?
భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ?
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
రిసెప్షన్‌లో ఈ పని ఏందిరయ్యా.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
రిసెప్షన్‌లో ఈ పని ఏందిరయ్యా.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
తిరుపతి తొక్కిసలాట ఘటన- మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన
తిరుపతి తొక్కిసలాట ఘటన- మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన