AP ECET 2025 Exam Date: ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి వరుస ప్రవేశ పరీక్షలు
జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసెట్ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు. మే 6వ తేదీన రెండు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈసెట్ షెడ్యూల్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఈసెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా..

అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు. మే 6వ తేదీన రెండు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈసెట్ షెడ్యూల్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈసెట్ పరీక్షలకు ఎన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అన్నారు. మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు మొదటి షిఫ్ట్, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈసెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక ఈ పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌తోపాటు ఎదైనా ఫొటో ఐడెంటిటీ కార్డును అభ్యర్ధులు తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. అలాగే క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబోమని వెల్లడించారు. ఇక ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. మే 2 నుంచి ఈ ప్రవేశ పరీక్షలు మొదలై జూన్ 13తో ముగియనున్నాయి. వివిధ తేదీల్లో పలు ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు జరుగనున్నాయంటే..
పరీక్ష తేదీలు ఇవే…
- ఏపీ ఆర్‌సెట్ 2025 పరీక్ష.. మే 2 నుంచి 5 వరకు
- ఏపీ ఐసెట్ 2025 పరీక్ష.. మే 7న,
- ఏపీ ఈఏపీసెట్ 2025 (అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు) 2025 పరీక్ష.. మే 19, 20 తేదీల్లో
- ఏపీ ఈఏపీసెట్ 2025 (ఇంజినీరింగ్ విభాగానికి) 2025 పరీక్ష.. మే 21 నుంచి 27 వరకు
- ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ 2025 పరీక్ష.. మే 25న
- ఏపీ పీజీఈసెట్ 2025 పరీక్షలు.. జూన్ 5 నుంచి 7 వరకు
- ఏపీ ఎడ్‌సెట్ 2025 పరీక్ష.. జూన్ 8న
- ఏపీ పీజీసెట్ 2025 పరీక్ష.. జూన్ 9 నుంచి 13 వరకు
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




