EAPCET 2023 Final Phase Counselling: ఈ నెల 14 నుంచి ఏపీ ఈఏపీసెట్ 2023 తుది విడత కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2023 ఎంపీసీ స్ట్రీమ్ చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ సోమవారం (సెప్టెంబరు 11న) ప్రకటనలో పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన..
అమరావతి, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2023 ఎంపీసీ స్ట్రీమ్ చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ సోమవారం (సెప్టెంబరు 11న) ప్రకటనలో పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణలో వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన కోర్సులకు కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన కోర్సుల్లో ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం (సెప్టెంబరు 11) అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగింది. ఎంసెట్-2023లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సును ఎంచుకున్నారు. ఎంసెట్లో 489వ ర్యాంకు వచ్చిన బి.మనోజ్‌కు రాజేంద్రనగర్ పశువైద్య కాలేజీలో బీవీఎస్ కోర్సులో ప్రవేశం లభించింది. 911 ర్యాంకు వచ్చిన పి లక్ష్మీచందన, 948 ర్యాంకు సాధించిన కెచందన వీరిద్దరు కూడా ఆ కాలేజీలోనే ప్రవేశాలు పొందారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ చేతుల మీదుగా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి శ్రావణ్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల అధికారులు సీమ, జ్ఞానప్రకాశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, పీజీ బీ, సీ కేటగిరి సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు, నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆర్మీ డెంటల్ కాలేజీలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, పీజీ-మెడికల్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీ కేటగిరి సీట్లు, సీ కేటగిరి కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. మెడికల్ సీట్లలో ప్రవేశాలకు గతంలో నమోదు చేసుకోని విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (ఆదివారం) సెప్టెంబరు 11న తన ప్రకటనలో వివరించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.