Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Exams 2025: ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు! ఎప్పటి వరకంటే

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. పరీక్షల ఫీజు గడువును పెంపొందిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవగా.. ఈ నెల 11 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని గతంలో తెలిపింది. అయితే తాజా ప్రకటనలో..

AP 10th Exams 2025: ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు! ఎప్పటి వరకంటే
Ap Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2024 | 10:03 AM

అమరావతి, నవంబర్‌ 5: 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించవచ్చని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. తాజాగా ఆ గడువును పొడిగించినట్లు ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి మరో ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024-25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్‌ 18వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్‌ 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 3 వరకు, రూ.500 ఆలస్య ఫీజుతో డిసెంబర్‌ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌ లో స్కూల్‌ లాగిన్‌లో విద్యార్ధుల ఫీజు చెల్లించాలని డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులు తమ ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లిస్తే.. వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తారు. నామినల్‌ రోల్స్‌ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్‌ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్‌ జారీకి ముందు ఎడిట్‌ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్‌ దేవానందరెడ్డి వివరించారు. పదో తరగతిలో అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి అయితే రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 చెల్లించాలి. వొకేషనల్‌ విద్యార్థులు అదనంగా మరో రూ.60, నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్సించవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఏపీ టెట్‌ 2024 ఫలితాల్లో మెరిసిన యువతి.. 150కి 150 మార్కులు

ఏపీ జులై సెషన్‌ టెట్‌ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని నూరు శాతం మార్కులు సాధించారు. పేపర్‌ 1ఏ (ఎస్జీటీ)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. దీంతో టెట్ వెయిటేజీ మార్కులు 20కి 20 సాధించినట్లైంది. 2014-16 మధ్య డైట్‌ పూర్తి చేసిన ఆమె డీఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని చెబుతుంది. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో టెట్‌ ఫుల్ సాధించగలిగానని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!