AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 2 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా పడే ఛాన్స్! కారణం ఇదే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. ఇటీవల మెయిన్స్ షెడ్యూల్ విడుదలవగా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో గ్రూప్ 2 పరీక్ష తేదీపై సందిగ్ధత నెలకొంది..

APPSC Group 2 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా పడే ఛాన్స్! కారణం ఇదే..
APPSC Group 2 Mains Exam
Srilakshmi C
|

Updated on: Nov 05, 2024 | 9:30 AM

Share

అమరావతి, నవంబర్‌ 5: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను ఇటీవల కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అయితే జనవరి 5న జరుగుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం లేకపోలేదు. నేడో రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య రాత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు బిజీగా ఉండనున్నాయి.

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటి కన్నా ముందే జనవరి 5న గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు తెలియజేస్తూ అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ గ్రూప్‌ 2 వాయిదా వేస్తే ఏప్రిల్‌ లేదా మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలుంటుంది.  ఏప్రిల్‌ వరకు పరీక్ష కేంద్రాలన్నీ బిజీ ఉంటాయి. కాబట్టి మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. అయితే డీఎస్సీ రాత పరీక్షల తేదీలు అనుసరించి గ్రూప్‌ 2 తేదీ మార్చాలా.. వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి.

మరోవైపు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీలు డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావు, లక్ష్మణరావులతో కలిసి ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధకు సోమవారం వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే డీవైఈఓ పరీక్ష కటాఫ్‌ మార్కులు కూడా తగ్గించాలని కోరారు. ఈ మేరకు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మాల్దీవులు కాదు.. ఇది మన రాజస్థానే..! డంపింగ్ యార్డ్ అందాలకు ఫిదా
మాల్దీవులు కాదు.. ఇది మన రాజస్థానే..! డంపింగ్ యార్డ్ అందాలకు ఫిదా
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. రూ.5వేలు తగ్గిన
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. రూ.5వేలు తగ్గిన
మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో..
మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో..