AMD Recruitment 2022: పదో తరగతి/డిగ్రీ అర్హత కలిగిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న..
భారత ప్రభుత్వ అటామిక్ విభాగానికి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎమ్‌డీ)లో 321 జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యురిటీ ఆఫీసర్, సెక్యురిటీ గార్డు పోస్టుల ఇంకా దరఖాస్తు చేసుకోలేదా?..
భారత ప్రభుత్వ అటామిక్ విభాగానికి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎమ్‌డీ)లో 321 జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యురిటీ ఆఫీసర్, సెక్యురిటీ గార్డు పోస్టుల ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 17వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు రూ.100ల, రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ పోస్టులు: 9
- అసిస్టెంట్ సెక్యురిటీ ఆఫీసర్ పోస్టులు: 38
- సెక్యురిటీ గార్డు పోస్టులు: 274
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.