ALIMCO Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆలిమ్‌కోలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం పొందే అవకాశం..

ALIMCO Recruitment: ఆర్టిఫిషియల్ లింబ్స్‌ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆలిమ్‌కో) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాన్పూర్‌లో ఉన్న ఈ మినీరత్న సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న...

ALIMCO Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆలిమ్‌కోలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం పొందే అవకాశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 25, 2021 | 2:23 PM

ALIMCO Recruitment: ఆర్టిఫిషియల్ లింబ్స్‌ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆలిమ్‌కో) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాన్పూర్‌లో ఉన్న ఈ మినీరత్న సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఆక్సిలరీ ప్రొడక్షన్‌ సెంటర్లు, రీజనల్‌ మార్కెటింగ్‌ సెంటర్లలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ఆఫీసర్, క్యూసీ అసిస్టెంట్, అకౌంటెంట్, వర్క్‌మెన్, స్టోర్‌ అసిస్టెంట్, మెషినిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

* మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానిక్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, నైపుణ్యాలు ఉండాలి.

* అభ్యర్థలు వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తులను మేనేజర్‌(పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌), అలిమ్‌కో, జీటీ రోడ్, కాన్పూర్‌–209217 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.30,832 నుంచి రూ.1,80,200 చెల్లిస్తారు.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌, పని అర్హత ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అనంతరం టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ 18-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Nostradamus Predictions For 2022 : 2022లో ముంచుకొస్తున్న మరో ప్రమాదం.. లైవ్ వీడియో

199 నిమిషాల బ్యాటింగ్.. 42 బంతుల్లో 178 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు..

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..