AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AISSEE 2024 Exam Pattern: అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష (AISSEE) – 2024కు దరఖాస్తులు.. 6వ, 9వ తరగతిలో ప్రవేశాలు

పాఠశాల స్థాయి నుంచే త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను సిద్ధం చేసే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సారానికి అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9వ తరగతి ప్రవేశాల కోసం సైనిక్ స్కూల్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది.19 కొత్త సైనిక పాఠశాలలకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రవేశాలు..

AISSEE 2024 Exam Pattern: అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష (AISSEE) - 2024కు దరఖాస్తులు.. 6వ, 9వ తరగతిలో ప్రవేశాలు
AISSEE 2024
Srilakshmi C
|

Updated on: Nov 13, 2023 | 8:58 PM

Share

పాఠశాల స్థాయి నుంచే త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను సిద్ధం చేసే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సారానికి అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9వ తరగతి ప్రవేశాల కోసం సైనిక్ స్కూల్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది.19 కొత్త సైనిక పాఠశాలలకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రవేశాలు కల్పించనుంది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.

అర్హతలు..

ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి తప్పినిసరిగా 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాల బాలికలు ఇరువురూ ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దేశ వ్యాప్తంగా 186 (దాదాపు అన్ని సైనిక స్కూళ్లు) పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎంపిక ప్రక్రియ విధానం ఇదీ..

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024 ప్రవేశపరీక్షలో అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు. పెన్ పేపర్ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు 125 ప్రశ్నలకు మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. 2.30 గంటలపాటు పరీక్ష ఉంటుంది. ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.

తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్ం 100 ప్రశ్నలకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయాలి.తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది.

సీట్ల కేటాయింపు ఇలా.. ఆరో తరగతిలో మొత్తం 5225 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ స్కూళ్లలో 2970, ప్రైవేటు స్కూళ్లలో 2255 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో కోరుకొండ (విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం (ఎస్పీఎస్సార్‌ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.

మరిన్నికెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్