Fact Check: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన

Fact Check: నిరుద్యోగుల అత్యాశను పెట్టుబడిగా చేసుకొని కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. షార్ట్‌కట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరుతో ఎన్ని మోసాలు వెలుగులోకి వస్తున్నా...

Fact Check: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన
Follow us

|

Updated on: Apr 27, 2022 | 1:33 PM

Fact Check: నిరుద్యోగుల అత్యాశను పెట్టుబడిగా చేసుకొని కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. షార్ట్‌కట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరుతో ఎన్ని మోసాలు వెలుగులోకి వస్తున్నా నిరుద్యోగులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. అక్రమార్కులు మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నకిలీ రాయుళ్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సంస్థ దృష్టికి వచ్చింది. ఏకంగా నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్‌ను సృష్టిస్తూ మరీ నిరుద్యోగులను మోసగిస్తున్నారు. దీంతో ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో ట్విట్టర్‌ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు.

ఈ ట్వీట్‌లో.. ‘ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేరుతో ఫేక్‌ ఆఫర్‌ లెటర్స్‌తో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగాల పేరుతో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బులు కట్టించుకున్న తర్వాత ఫేక్‌ రిసిప్ట్‌లు కూడా ఇస్తున్నట్లు దృష్టికి వచ్చింది. ఇలాంటి మోస పూరిత ప్రకటనలకు, వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల విషయమై ఎలాంటి ప్రకటన ఉన్న అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకున్న తర్వాతే కన్ఫామ్‌ చేసుకోండి అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: CM KCR Speech: ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్..

మీరు రోజూ చేసే పనులకు ఎన్ని కేలరీలు ఖర్చవుతాయో తెలుసా?