AIIMS Recruitment: తెలంగాణ, బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..
AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని బీబీనగర్‌లో..
AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్న ఎయిమ్స్‌లో మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 63 ఖాళీలకుగాను సీనియర్ రెసిడెంట్లు (నాన్ అకడమిక్) 38, జూనియర్ రెసిడెంట్లు (నాన్ అకడమిక్) 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* జనరల్ మెడిసిన్ అండ్ అనెస్తీషియా, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అండ్ రేడియాలజీ, ఆప్తల్మాలజీ, అర్థోపెడిక్స్ వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
* సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ( ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్ / డీఎన్‌బీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్/ తత్సమాన ఉత్తీర్ణతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఐ/ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 37 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఒక ఒకవేళ దరఖాస్తులు పోస్టులకన్నా మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాత పరీక్ష నిర్వహిస్తారు. అదే తక్కువ దరఖాస్తులు వస్తే అర్హత పరీక్ష నిర్వహించి, సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 09-11-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! త్వరలో మళ్లీ ఆ సేవలు ప్రారంభం..
నాన్నా.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం..
CM KCR: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నవంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ