AAI Recruitment: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రీజనల్ హెడ్ క్వార్టర్ 2022-23 ఏడాదికి గాను నార్తర్న్ రీజియన్ లోని వివిధ విమానాశ్రయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ కోసం ఈ పోస్టులను తీసుకోనున్నారు...
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రీజనల్ హెడ్ క్వార్టర్ 2022-23 ఏడాదికి గాను నార్తర్న్ రీజియన్ లోని వివిధ విమానాశ్రయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ కోసం ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 44 ఐటిఐ ట్రేడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ట్రేడ్ లలో ఐటిఐ/ఎన్ సీవీటీ సర్టిఫికెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31-08-2022 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులును విద్యార్హతలు, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 7, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..