AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS DOST 2024 Phase 3 Results: మూడో విడతలో 73,662 మందికి డిగ్రీ సీట్లు.. జులై 15 నుంచి తరగతులు ప్రారంభం

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం ముడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారు ఉన్నారు. వీరంతా మళ్లీ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుని కొత్త కాలేజీలు, కోర్సుల కోసం ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలను దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి వెల్లడించారు..

TS DOST 2024 Phase 3 Results: మూడో విడతలో 73,662 మందికి డిగ్రీ సీట్లు.. జులై 15 నుంచి తరగతులు ప్రారంభం
TS DOST 2024 Phase 3 Results
Srilakshmi C
|

Updated on: Jul 07, 2024 | 4:30 PM

Share

హైదరాబాద్‌, జులై 7: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం ముడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారు ఉన్నారు. వీరంతా మళ్లీ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుని కొత్త కాలేజీలు, కోర్సుల కోసం ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలను దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి వెల్లడించారు. వెబ్‌ ఆప్షన్లు తక్కువగా ఇచ్చినందున 6,650 మందికి సీట్లు దక్కలేదని ఆయన తెలిపారు. సీట్లు పొందినవారు జులై 7 నుంచి 11వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో విడతలో సీటు పొంది.. మళ్లీ మూడో విడతలో కొత్తగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు కూడా మళ్లీ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని దోస్త్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు.

సీట్లు పొందిన విద్యార్ధుల మొబైల్‌ ఫోన్లకు ఓటీపీ వస్తుందని, జులై 8 నుంచి 12వ తేదీ వరకు సంబంధిత కాలేజీలకు వెళ్లి, ఆ ఓటీపీ సమర్పించి తమ సీట్లను ఫైనలైజ్‌ చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్ట్‌ చేయకుంటే సీట్లు కోల్పోతారని అన్నారు. దోస్త్‌ దరఖాస్తు, సీటు కేటాయింపు లెటర్, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్, పది, ఇంటర్‌ మెమోలు, 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు బోనాఫైడ్, కుల, ఆదాయ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, 4 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని ఆయన సూచించారు.

ఇక తాజా ప్రక్రియతో మూడు విడతల సీట్ల కేటాయింపు పూర్తి అయినట్లైంది. దీంతో జులై 15వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఖాళీలను బట్టి తమ కోర్సులను మార్చుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి సూచించారు. ఇలా కోర్సులు మార్చుకునేందుకు జులై 16 నుంచి 18వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 19న సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను..
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను..
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?