Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips to Guide Students: టెన్త్/ఇంటర్‌ తర్వాత.. విద్యార్ధులు కెరీర్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవల్సిన పంచతంత్రాలు!

పదో తరగతి.. ఇంటర్మీడియట్.. ఈ రెండు దశల్లో కెరీర్ ను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచీతూచీ అడుగులు వేయాలి. ఎందుకంటే ఈ దశలో తీసుకునే నిర్ణయాలు మీ పూర్తి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి కెరీర్ ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్ధులు ఈ కింది ఐదు విషయాలు తప్పక గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం రండీ..

Tips to Guide Students: టెన్త్/ఇంటర్‌ తర్వాత.. విద్యార్ధులు కెరీర్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవల్సిన పంచతంత్రాలు!
Tips To Guide Students
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2025 | 12:59 PM

టెన్త్, ఇంటర్‌కి సంబంధించిన బోర్డ్ పరీక్షలు సమీపిస్తున్నందున, విద్యార్థులు తమ కెరీర్ మార్గాలను ఎంచుకునేందుకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాస్తవానికి ఇది చాలా కీలకమైన దశ. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. పరిమిత సమాచారం, తక్కువ ఎంపికలను కలిగి ఉన్న గతానికి భిన్నంగా, ప్రస్తుత విద్యార్థులకు విస్తృత అవకాశాలు, వివిధ రంగాలు వారి కెరీర్ మార్గాల్లో సరైన మార్గాన్ని ఎంచుకునే వీలును కల్పిస్తున్నాయి.

కానీ, ఈ విస్తృత ఎంపికలు మరో కొత్త సవాల్.. ట్రెండులను అనుసరించడం కాకుండా తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని మనముందుకు తెస్తున్నాయి. విద్యార్థులు ఈ కెరీర్ ఎంపిక దశను శ్రద్దగా, జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పుడు నిర్ణయం అనేది సమయం, డబ్బు వృధాతో పాటు గందరగోళాన్ని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేయవచ్చు. ఈ కీలక దశలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన ఐదు ప్రధాన విషయాలు రాయన్ ఎడ్యునేషన్ సర్వీసెస్ అకాడెమిక్ లీడర్ శ్రీలత డోంగ్రే సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవటం

విద్యార్థులు తోటివారి ఒత్తిడి, సామాజిక అంచనాల ద్వారా ప్రభావితం కాకుండా తమ ఆసక్తులు, ప్రాధాన్యతలు, వ్యక్తిగత అభిరుచులను లోతుగా విశ్లేషించుకోవాలి. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా వారి స్వభావం, బలాలు, నైపుణ్యాలు ఏ రంగానికి అనుకూలంగా ఉంటాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. స్వయంగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడం ద్వారా నిరాశ, అధిక-ఒత్తిడి ముప్పు తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో చదువులో ముందు ఉండటానికి సహాయపడుతుంది. ఎంచుకున్న కెరీర్ మార్గంలో రాణించగల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

పరిశోధన – భవిష్యత్తు అభివృద్ధి

వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, మారుతున్న ప్రపంచ ప్రాధాన్యతలు నిరంతరం కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీస్తున్నాయి. భవిష్యత్తు ట్రెండుల గురించిన లోతైన పరిశోధన, అవగాహన విద్యార్థులకు అధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగాలను, డిమాండ్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా వారు తమ కెరీర్ మార్గాలను తెలివిగా ప్లాన్ చేసుకోవడమే కాకుండా, దీర్ఘకాలిక విజయానికి, మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు తగినట్లుగా వారి కెరీర్ ఎంపికలకు సహాయపడతాయి.

నైపుణ్యాభివృద్ధి

వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అత్యంత అవసరం. సాంకేతికత ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మారుతున్నందున, విద్యార్థులు “అప్‌ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్” నిరంతర అవసరాన్ని గుర్తించాలి. ఇది వారికి గ్లోబల్ మార్కెట్లో పోటీతత్వానికి సహాయపడుతుంది. అందువల్ల, విద్యార్థులు కేవలం విద్యపై మాత్రమే దృష్టి సారించకుండా, తమ నైపుణ్యాలను మెరుగుపరిచే, మారుతూ ఉన్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తి పురోగతిలో సహాయపడే కెరీర్ మార్గాన్ని ఎంచుకోవాలి.

ఆర్థిక ప్రణాళిక & ROI

విద్యార్థులు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో సహాయపడేందుకు రూపొందించబడిన కెరీర్ ప్లాన్లో ఆర్థిక ప్రణాళిక కూడా భాగమై ఉండాలి. విద్యార్థులు వాస్తవికతను పరిగణనలోకి తీసుకొని, వారి కెరీర్ ఎంపికలను జాగ్రత్తగా విశ్లేషించాలి. భవిష్యత్తు కెరీర్ మార్గాలు ప్రస్తుతం వారి వద్దనున్న ఆర్థిక వనరులను తగ్గించకూడదు. బదులుగా విద్యార్థి లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక ఒత్తిడిని తగ్గించి, గరిష్ట భవిష్యత్తు ప్రయోజనాలను అందించే కెరీర్ ఎంపికలను చేయాలి.

కోర్సు మార్పు గురించిన వ్యూహాలు

సరళమైన కెరీర్ మార్గాలు చాలా అరుదు అని విద్యార్థులు గుర్తించాలి. ఒక విద్యార్థి తను ఎంచుకున్న కెరీర్లో వృద్ధి, అవకాశాలు తక్కువ అని భావిస్తే వారి సహచరులు, సలహాదారులు, మార్గదర్శకుల సహాయాన్ని పొందాలి. మార్పులకు సిద్ధంగా ఉండటం, కొత్త అవకాశాల దిశగా అనుగుణంగా మారడం, కోర్సులో మార్పులు అభివృద్ధి సహజమైన భాగంగా చూడటం చాలా ముఖ్యం.

చివరగా.. కెరీర్ ఎంపిక విషయంలో ట్రెండ్, తోటివారి ఒత్తిడి, సామాజిక అంచనాలను గుడ్డిగా అనుసరించకూడదు. భవిష్యత్ విజయంలో విద్యార్థులకు స్వీయ అవగాహన, ఆర్థిక ప్రణాళిక, పరిశోధనలకు పరస్పరంగా ఒక ఆలోచనాత్మక వ్యూహం అవసరం. వేగవంతమైన, డైనమిక్, అత్యంత డిమాండ్ ఉన్న జాబ్ మార్కెట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, తమ లక్ష్యాల దిశగా ముందుకు సాగడం, సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్థిరంగా ఉండటం, పరిపూర్ణమైన, విజయవంతమైన భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.