Free Coaching for Groups: టీఎస్పీయస్సీ గ్రూప్ 2,3,4 పరీక్షలకు ఉచిత కోచింగ్.. దరఖాస్తుకు రేపే ఆఖరు..
తెలంగాణ గ్రూప్స్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలకు నాలుగు నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ‘100 మిలియన్ ఇనిస్టిట్యూట్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..
తెలంగాణ గ్రూప్స్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలకు నాలుగు నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ‘100 మిలియన్ ఇనిస్టిట్యూట్’ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టీఎస్పీయస్సీ గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాలతోపాటు, ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు 100 మిలియన్ ఇనిస్టిట్యూట్ సంస్థ డైరెక్టర్ రతన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
నాలుగు నెలలపాటు నిర్వహించే ఆ శిక్షణలో అర్థమేటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో క్లాసులు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి, శిక్షణతోపాటు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పించున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగినవారు జనవరి 22లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీ, హిమాయత్‌నగర్‌లోని సంస్థ బ్రాంచ్‌లలో జనవరి 23 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 7093017493ను సంప్రదించవచ్చన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.