WCL Recruitment 2023: పదో తరగతి అర్హతతో కోల్ ఇండియా లిమిటెడ్‌లో 135 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన నాగ్‌పుర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన 135 మైనింగ్ సిర్దార్..
భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన నాగ్‌పుర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 19, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో రూ.1150లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మైనింగ్ సర్దార్ (టెక్నికల్ అండ్ సూపర్‌వైజరీ గ్రేడ్-సి) పోస్టులు: 107
- సర్వేయర్- మైనింగ్(టెక్నికల్ అండ్ సూపర్‌వైజరీ గ్రేడ్-బి) పోస్టులు: 28
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.