BISAG-N Recruitment 2023: భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఐటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బిసాగ్-ఎన్).. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 106 ఐటీ ఎగ్జిక్యూటివ్..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బిసాగ్-ఎన్).. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 106 ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్/బీఎస్సీ ఐటీ/బీసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణత పొందిన ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు జనవరి 19, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 23, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్ చేసిన తర్వాత ఎంపికై అభ్యర్ధులకు ఈమెయిల్, ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.