Tech Layoffs: ఉద్యోగుల కొంప కొల్లేరు.. భారీగా ఉద్యోగులను తొలగించిన మరో బడా కార్పోరేట్ కంపెనీ..
ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ ఒకటి తర్వాత మరోటి ఎంప్లాయిస్‌ను ఇంటికి పంపిస్తున్నారు. టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్.. ఏకంగా 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ ఒకటి తర్వాత మరోటి ఎంప్లాయిస్‌ను ఇంటికి పంపిస్తున్నారు. టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్.. ఏకంగా 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చాలా కంపెనీలు లేఆఫ్ బాటలో పయనిస్తున్నాయి.తాజాగా వీడియా కాన్ఫరెన్సింగ్ సేవలందించే కంపెనీ జూమ్ వంతొచ్చింది. ఏకంగా కంపెనీ CEOనే తన జీతంలో 98శాతం తగ్గించుకున్నట్టు ప్రకటించారు. 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్ వేతనాల్లోనూ 20శాతం తగ్గించుకుంటారని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంటున్నామని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ పేర్కొన్నారు.
ఇక కంపెనీలో 15శాతం ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధమైంది. అంటే దాదాపు 13వందల మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. ఈ మేరకు తమ బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలిపింది కంపెనీ. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు జూమ్ CEO ఎరిక్ యాన్. ఉద్యోగాల తొలగింపుకు పూర్తి బాధ్యత తనదేనని వెల్లడించారు. ప్రతిభ ఉన్న 1300 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. అంటూ భావోద్వేగంతో లేఖ రాశారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ మెయిల్స్ వస్తాయని, ఈ పద్ధతిలో సమాచారం అందిస్తున్నందుకు తనను క్షమించాలంటూ ఉద్యోగాలు కోల్పుతున్న వారిని కోరారు.
500 మందిని తొలగించిన కామర్స్ దిగ్గజం ఈబే..
ఈ కామర్స్ సంస్థ eBay కూడా లేఆఫ్ బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం శ్రామికశక్తిలో 4% ఉద్యోగులను తొలగించనున్నట్లు పేర్కొంది. ఇది అధిక సంభావ్య రంగాలలో పెట్టుబడి పెట్టడానికి, కొత్త పాత్రలను సృష్టించడానికి దోహదపడుతుందని.. కొత్త సాంకేతికతలు, కస్టమర్ ఆవిష్కరణలు, కీలక మార్కెట్లు ముఖ్యమని Ebay చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జమే (Jamie Iannone) పేర్కొన్నారు.
ఇక దిగ్గజ కంపెనీలన్నీ వేలల్లో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి అని సింపుల్‌గా చెప్పేసి లేఆఫ్స్ విధిస్తున్నాయి. దీంతో చాలా కంపెనీల ఉద్యోగులు వణికిపోతున్నారు. జాబ్ ఎప్పుడు ఊడుతుందో అంటూ టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తోందోనంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..