AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Ticket Booking: ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..

రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్ పొందాలనుకుంటున్నారా..? రైల్వే వన్ యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ ద్వారా టికెట్ల కొనుగోళ్లపై 6 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం రైల్వేశాఖ కల్పిస్తోంది. రైల్వేశాఖ కొత్తగా తీసుకొచ్చిన ఈ యాప్ ఎలా ఉపయోగించాలనేది చూద్దాం.

Railway Ticket Booking: ప్రయాణికులకు  రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..
Railway Ticket Booking
Venkatrao Lella
|

Updated on: Jan 21, 2026 | 8:58 AM

Share

ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. వివిధ ప్రైవేట్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ రైల్వే టికెట్ల కొనుగోళ్లపై ఆఫర్లు ఇస్తోన్న విషయం తెలిసిందే. సర్వీస్, బుకింగ్ ఛార్జీలను తొలగించడం, డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తోన్నాయి. ప్రైవేట్ యాప్స్‌కు పోటీగా రైల్వేశాఖ కూడా ప్రయాణికులకు టికెట్ల బుకింగ్స్‌పై ఆఫర్లు ఇస్తోంది. రైల్వే వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లపై ఏకంగా 3 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 14న నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది. ప్రయాణికులు ఎలా ఈ ఆఫర్ పొందాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాం

జులై 14 వరకు అందుబాటులో..

రైల్వేశాఖ రైల్ వన్ యాప్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు రిజర్వ్ చేయని జనరల్ టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. టికెట్ల కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు అన్‌రిజర్వుడ్ టికెట్లను బుకింగ్ చేసుకునేలా ఈ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా అన్‌రిజర్వ్ డ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం రాయితీ ప్రకటించింది రైల్వేశాఖ. జనవరి 14న ఈ ఆఫర్ ప్రారంభమవ్వగా.. జులై 14 వరకు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ వర్గాలు ప్రకటించాయి. ఈ ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి భారీగా స్పందన వస్తోంది. టికెట్లపై తగ్గింపు వస్తుండటంతో ఎక్కువమంది ఈ యాప్ ఉపయోగించి టికెట్లను బుక్ చేసుకుంటున్నారు.

అలా చేస్తే మరో 3 శాతం డిస్కౌంట్

రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వుడ్ టికెట్లను బుక్ చేసుకుని యూపీఐ, కార్డులు, మొబైల్, నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ విధానంలో పేమెంట్ చేస్తే 3 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఆర్ బ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే మరో 3 శాతం అదనంగా డిస్కౌంట్ వస్తోంది. ఇలా 6 శాతం వరకు ఆన్ రిజర్వుడ్ టికెట్లపై రాయితీ పొందవచ్చు. ప్రజలు డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని రైల్వేశాఖ చెబుతోంది.

రైల్ వన్ యాప్ ఫీచర్లు

ఈ యాప్‌ ద్వారా రైల్వే ప్రయాణికుల అన్నీ సేవలు ఒకేచోట లభించనున్నాయి. రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, కోచ్ పొజిషన్, ఫుడ్ బుకింగ్, రైల్వే ఫిర్యాదులు వంటి సేవలు పొందవచ్చు. ఇక రైల్వే పార్శిల్ ట్రాకింగ్ కూడా చూడవచ్చు. ఇప్పటివరకు ఒక్కో సేవకు ఒక్కో ఫ్లాట్‌ఫామ్‌లోకి ప్రయాణికులు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది ఆ యాప్ వల్ల తొలగిపోయింది.

ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..