IRCTC Complaints: రైళ్లల్లో ఆహార అవస్థలు.. మూడేళ్లల్లో ఆరు రెట్లు పెరిగిన ఫిర్యాదులు
భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా ప్రజలు భారతీయ రైల్వేలను ఆశ్రయించారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే సేవల్లో కూడా వివిధ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రయాణికులకు వివిధ సేవలను అందించే విషయంలో ఐఆర్‌సీటీసీ కీలక చర్యలు తీసుకుంది. ప్రజలు, రైల్వే భద్రతా అంశాలు పక్కన పెడితే ముఖ్యంగా ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో ఐఆర్‌సీటీసీ అస్సలు పట్టించుకోవడం ప్రయాణికులు వాపోతున్నారు.

భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా ప్రజలు భారతీయ రైల్వేలను ఆశ్రయించారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే సేవల్లో కూడా వివిధ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రయాణికులకు వివిధ సేవలను అందించే విషయంలో ఐఆర్‌సీటీసీ కీలక చర్యలు తీసుకుంది. ప్రజలు, రైల్వే భద్రతా అంశాలు పక్కన పెడితే ముఖ్యంగా ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో ఐఆర్‌సీటీసీ అస్సలు పట్టించుకోవడం ప్రయాణికులు వాపోతున్నారు. ఓ సంస్థ సమాచార హక్కు ద్వారా ఐఆర్‌సీటీసీ అడిగిన ప్రశ్నకు ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024 మధ్య భారతీయ రైల్వేలో ప్రయాణీకుల ఆహార నాణ్యత, పరిశుభ్రత సంబంధిత ఫిర్యాదుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. ముఖ్యంగా రాజధాని, శతాబ్ది, దురంతో, మెయిల్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లల్లో కూడా ఆహార సేవలు అధ్వానంగా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆహార సేవల ఫిర్యాదుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఏప్రిల్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 మధ్య రైళ్లల్లో ఆహార ఫిర్యాదుల సంఖ్య మార్చి 2022 చివరి నాటికి 1,192తో పోలిస్తే 6,948కు పెరిగింది. ఏప్రిల్ 2021 నుంచి ఫిబ్రవరి 2024 మధ్య మొత్తం క్యాటరింగ్ ఫిర్యాదుల సంఖ్య 11,850గా ఉంది. ఆహార ఫిర్యాదులపై ఐఆర్‌సీటీసీ 68 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే 33 కాంట్రాక్టులు జనవరి 2021 నుంచి మార్చి 2024 మధ్య రద్దు చేసిందని ఆర్‌టీఐ దరఖాస్తుదారుడికి సమాధానం ఇచ్చింది. జనవరి 2022లో రోజుకు సగటున 14 నాణ్యత/పరిశుభ్రత ఫిర్యాదులు అందాయి. 2023–24లో సాధారణంగా రోజుకు 16 లక్షల మందికి ఆహారం డెలివరీ చేస్తుంటే రోజుకు 0.0012 శాతం ఫిర్యాదు వచ్చాయి. వాస్తవానికి, 2023–24లో వండిన భోజనంపై నాణ్యత/పరిశుభ్రత ఫిర్యాదులు తగ్గాయి. సర్వీస్ ప్రొవైడర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.
రైల్వే ఆహార కాంట్రాక్టు ఒప్పందం, నిబంధనలు, షరతుల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లు పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఆహార నమూనాలను ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. వంటశాలలను సీసీ టీవీ ద్వారా పర్యవేక్షిస్తారు. మరింత నాణ్యతను మెరుగుపరచడానికి, క్యాటరింగ్ సంబంధిత ఫిర్యాదులను తగ్గించడానికి దీర్ఘకాల క్లస్టర్ టెండర్లను పూర్తి చేయడంతో పాటు ఆల్ ఇండియా ప్రాతిపదికన ఆధునిక బేస్ కిచెన్‌ల చైన్‌లను ఏర్పాటు చేశామని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫిబ్రవరి 2024లో హిందూ బిజినెస్ లైన్ నివేదిక ప్రకారం ఐఆర్‌సీటీసీకు మొత్తం 1,518 క్యాటరింగ్ కాంట్రాక్టులు ఉన్నాయి. వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ గత మూడేళ్లలో కేవలం మూడు కాంట్రాక్టులు మాత్రమే రద్దు చేశారు. 2017 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ రిపోర్ట్‌లో ప్రయాణికులకు సరైన ఆహారం అందించే విషయంలో భారతీయ రైల్వేలకు సంబంధించిన క్యాటరర్లు స్థిరంగా విఫలమవుతున్నారని నివేదిక వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








