IPO: లాభాల్లో ఉన్న కంపెనీలో వాటా కావాలా? అయితే ఈ ఐపీఓ గురించి తప్పక తెలుసుకోండి..
నిలకడగా లాభాలు ఆర్జిస్తూ కొనసాగుతున్న ఒక కంపెనీ.. తన వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం మూలధనం సమకూర్చుకునేందుకు ఐపీవోకు వస్తోంది. ఇప్పటి వరకూ ఆ కంపెనీ ప్రైవేటు యాజమాన్యంలో ఉంటుంది. ఐపీవో ఆ కంపెనీ షేర్లను ప్రజలకు విక్రయించడంతో వారందరూ వాటాదారులు అవుతారు.
ప్రతి కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అనేక ప్రణాళికలు రూపొందిస్తుంది. మార్కెట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజలకు దగ్గర కావడం, ఉత్పత్తిని పెంచుకోవడం, లాభాల ఆర్జన ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. వీటిని సాధించుకోవడానికి ప్రధానంగా డబ్బు అవసరం. దాన్ని ప్రజల నుంచి సేకరించే అవకాశం వివిధ కంపెనీలకు ఉంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా తన షేర్లను ప్రజలకు విక్రయించుకోవచ్చు. తద్వారా నిబంధనల మేరకు మూలధనం సేకరించుకునే వీలుంటుంది.
మూలధనం సేకరణ..
నిలకడగా లాభాలు ఆర్జిస్తూ కొనసాగుతున్న ఒక కంపెనీ.. తన వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం మూలధనం సమకూర్చుకునేందుకు ఐపీవోకు వస్తోంది. ఇప్పటి వరకూ ఆ కంపెనీ ప్రైవేటు యాజమాన్యంలో ఉంటుంది. ఐపీవో ఆ కంపెనీ షేర్లను ప్రజలకు విక్రయించడంతో వారందరూ వాటాదారులు అవుతారు. ఆ కంపెనీ పేరు ఓరియంట్ టెక్నాలజీస్. ఇది ఆగస్టు 21వ తేదీన ఐపీవోకు రానుంది. దాని వాటా ధరలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.
ఓరియంట్ టెక్నాలజీస్..
ఓరియంట్ టెక్నాలజీస్ కంపెనీ ఆగస్టు 21 నుంచి 23 వరకూ ఐపీవోలో ఉంటుంది. షేర్ ధరలను రూ.195 నుంచి రూ.206గా ఆ కంపెనీ నిర్ణయించింది. ఐపీవోలో దాదాపు రూ.215 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి కలిగిన పెట్టుబడి దారులందరూ వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 72 షేర్లు (ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది.
షేర్ల కేటాయింపులు..
ఓరియంట్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐపీవోలో ఈ సంస్థ రూ.120 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేస్తుంది. వీటిలో ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.95 కోట్ల విలువైన 46 లక్షల ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ఇక మొత్తం షేర్లలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం కేటాయింపులు జరిగినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
పెట్టుబడులు..
ఐపీవో వచ్చిన మూలధనాన్ని వేటికి కేటాయిస్తామనే విషయాన్ని కూడా ఓరియంట్ కంపెనీ స్పష్టం చేసింది. వచ్చిన మొత్తంలో రూ.79.65 కోట్లను మూలధన వ్యయాలకు, రూ.10.35 కోట్లను నవీముంబై లోని కార్యాలయం ప్రాంగణం కోసం, మిగిలిన డబ్బును సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడనున్నట్టు వెల్లడించింది.
కంపెనీ చరిత్ర..
ఓరియంట్ టెక్నాలజీస్ కంపెనీ విషయానికి వస్తే.. ఈ సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.602.89 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. అదే సమయంలో రూ.41.45 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్టు వెల్లడించింది. ఐటీ, క్లౌడ్, డేటా మేనేజ్ మెంట్ తదితర విభాగాల్లో సేవలు అందించే కంపెనీకి ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్ కేర్ , ఫార్మా తదితర విభాగాలలో అనేక మంది క్లయింట్లు ఉన్నారు. వాటిలో కోల్ ఇండియా, జ్యోతి ల్యాబ్స్, ఏసీజీ, ఇంటెగ్రాన్, బ్లూచిప్, ట్రేడ్ బుల్స్ ప్రముఖమైనవి. ఈ కంపెనీకి సంబంధించిన ఏకైక బుక్ రన్నింగ్ లీడ్ గా ఎలారా క్యాపిటల్ ప్రైవేటు లిమిటెడ్ వ్యవహరిస్తోంది. ఈ కంపెనీకి ముంబై, పుణె, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో సహా అనేక నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..