AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Shopping: ఆన్‌లైన్‌లో 4 డజన్ల గుడ్లను ఆర్డర్‌ చేస్తే రూ.48 వేలు గోవిందా..? అసలు ఏం జరిగిందంటే..

మహిళ అందుకున్న ఇమెయిల్ పెద్ద షాపింగ్ సైట్‌ను అనుకరిస్తూ వచ్చింది. అందుకే తెలుసుకోవడానికి వీలులేకుండా వెంటనే ఈ లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలు అందించగానే డబ్బులు కట్‌ అయ్యాయి. అందుకే ఆన్‌లైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు పదేపదే కస్టమర్లను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా చాలా మంది ఇలా మోసపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఎక్కువ మొత్తంలో రూ.48,199 ఆమె ఖాతా నుండి డబ్బులు..

Online Shopping: ఆన్‌లైన్‌లో 4 డజన్ల గుడ్లను ఆర్డర్‌ చేస్తే రూ.48 వేలు గోవిందా..? అసలు ఏం జరిగిందంటే..
Online Eggs Order
Subhash Goud
|

Updated on: Feb 29, 2024 | 4:54 PM

Share

ఈ మధ్య కాలం నుంచి ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులకు రకరకాల సందేశాలను పంపిస్తూ నిలువునా మోసగిపోతున్నారు. మీ మొబైల్‌కు ఏవైనా లింక్‌లతో మెసేజ్‌లు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయకూడదు. ఒక వేళ పొరపాటున ఈ లింక్‌లను ఓపెన్‌ చేసినట్లయితే మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులన్ని ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

డిస్కౌంట్ ఆఫర్ కారణంగా ఓ మహిళ ఆన్‌లైన్‌లో గుడ్లను ఆర్డర్ చేసింది. కానీ చివరికి దారుణంగా మోసపోయింది. బెంగళూరులో ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళకు ఇమెయిల్‌లో ఆఫర్ వచ్చింది. అందులో 4 డజన్ల అంటే 48 గుడ్లు కేవలం రూ. 49కి అందుబాటులో ఉన్నాయని, ఆర్డర్‌ చేసుకోండని మెసేజ్‌ వచ్చింది. దీంతో అత్యాశతో ఆ మహిళ షాపింగ్ లింక్‌పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ వివరాలను ఇచ్చింది. మహిళ ఫోన్‌కు ఓటీపీ రావడంతో దాన్ని షేర్ చేయగానే ఆమె ఖాతా నుంచి దాదాపు రూ.48 వేలు డెబిట్‌ అయ్యాయి.

మహిళ అందుకున్న ఇమెయిల్ పెద్ద షాపింగ్ సైట్‌ను అనుకరిస్తూ వచ్చింది. అందుకే తెలుసుకోవడానికి వీలులేకుండా వెంటనే ఈ లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలు అందించగానే డబ్బులు కట్‌ అయ్యాయి. అందుకే ఆన్‌లైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు పదేపదే కస్టమర్లను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా చాలా మంది ఇలా మోసపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఎక్కువ మొత్తంలో రూ.48,199 ఆమె ఖాతా నుండి డబ్బులు డెబిట్‌ కావడంతో లబోదిబోమంది. ఇదిలా ఉండగా, తాను మోసపోయినట్లు గుర్తించిన ఆ సదరు మహిళ హైగ్రౌండ్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపడుతున్నారు. ఇలాంటి నకిలీ యాడ్స్‌ను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి