AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: ఆ క్రెడిట్ కార్డులతో ఫ్లైట్ టిక్కెట్స్ ఫ్రీ.. బోలెడన్నీ ప్రయాణ ప్రయోజనాలు మీ సొంతం

ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. బ్యాంకులన్నీ పోటీపడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లే వారిక ప్రత్యేక ఆఫర్లను అందించడమే ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్స్‌పై రాయితీలను ఇస్తున్నాయి. కాంప్లిమెంటరీ ఎయిర్ టిక్కెట్లు లేదా డిస్కౌంట్ వోచర్‌లు తరచుగా ప్రయాణించే వారికి విలువైన ప్రయోజనంగా ఉంటాయి.

Credit Cards: ఆ క్రెడిట్ కార్డులతో ఫ్లైట్ టిక్కెట్స్ ఫ్రీ.. బోలెడన్నీ ప్రయాణ ప్రయోజనాలు మీ సొంతం
Credit Card
Nikhil
|

Updated on: May 28, 2024 | 9:00 AM

Share

బ్యాంకింగ్ రంగంలో మారుతున్న టెక్నాలజీ కీలక మార్పులను తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. బ్యాంకులన్నీ పోటీపడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లే వారిక ప్రత్యేక ఆఫర్లను అందించడమే ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్స్‌పై రాయితీలను ఇస్తున్నాయి. కాంప్లిమెంటరీ ఎయిర్ టిక్కెట్లు లేదా డిస్కౌంట్ వోచర్‌లు తరచుగా ప్రయాణించే వారికి విలువైన ప్రయోజనంగా ఉంటాయి. ఈ ఫీచర్ సాధారణంగా ఎయిర్‌లైన్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లలో స్వాగత, పునరుద్ధరణ లేదా మైల్‌స్టోన్ ప్రయోజనం రూపంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ కార్డ్‌లలో ఒకదానిని ఎంచుకున్నప్పుడు మీ బ్రాండ్ లాయల్టీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో విమానయాన ప్రయాణాలపై ప్రత్యేక ఆఫర్లను అందించే క్రెడిట్ కార్డుల గురించి కీలక విషయాలను తెలుసుకుందాం. 

క్లబ్ విస్తారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్

ఈ క్రెడిట్ కార్డు వార్షిక రుసుము రూ. 4,999గా ఉంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా కాంప్లిమెంటరీ ప్రీమియమ్ ఎకానమీ టిక్కెట్ వోచర్ & 1 క్లాస్ అప్‌గ్రేడ్ వోచర్‌ను పొందవచ్చు. ఈ కార్డు పరిమితి రూ  ​1.5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 4.5 లక్షలు, రూ. 9 లక్షలు, ఒక సంవత్సరంలో రూ. 12 లక్షలు వరకూ ఖర్చు చేయవచ్చు. స్వాగత ప్రయోజనాలుగా 3 నెలల కాంప్లిమెంటరీ ఈజీ డైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్ & కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్ పొందవచ్చు. కనీసం రూ.6000 ఖర్చు చేస్తే  బోనస్ సీవీ పాయింట్లు. 2వ, 3వ & 4వ బిల్లింగ్ సైకిల్‌లో నెలకు 30,000 వరకూ పొందవచ్చు. ప్రతి త్రైమాసికంలో దేశీయ విమానాశ్రయ లాంజ్‌లు,  స్పాలకు 2 వెలకమ్ విజిట్‌లతో పాటు త్రైమాసికానికి 1 కాంప్లిమెంటరీ అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ విజిట్‌ను పొందవచ్చు. 

యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్  

ఈ క్రెడిట్ కార్డు వార్షిక రుసుము రూ. 10,000గా ఉంటుంది. ఈ కార్డు ముఖ్య ప్రయోజనాలుగా  ఉచిత విమాన టిక్కెట్లను పొందవచ్చు. అలాగే ఈ కార్డు పొందినందుకు చెల్లించే రుసుము కింద కాంప్లిమెంటరీ బిజినెస్ క్లాస్ టికెట్ వోచర్‌ను అందిస్తారు. అలాగే మీ పరిమితిని పూర్తిగా చేరుకోగానే 1 బిజినెస్ క్లాస్ టిక్కెట్ వోచర్‌ను అందిసతారు. కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా గోల్డ్ మెంబర్‌షిప్, ప్రాధాన్యత చెక్-ఇన్, అదనపు బ్యాగేజీ అలవెన్స్, ప్రాధాన్య బోర్డింగ్ మొదలైన ప్రత్యేక ప్రయోజనాలతో వస్తుంది. అలాగే ప్రతి రూ.200 ఖర్చుపై ఆరు సీవీ పాయింట్లను పొందవచ్చు. ప్రతి త్రైమాసికంలో కనీసం రూ.50 వేలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన గోల్ఫ్ కోర్స్‌లలో గోల్ఫ్‌కు సంబంధించిన ఆరు కాంప్లిమెంటరీ రౌండ్లను పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

స్పైస్‌జెట్ యాక్సిస్ బ్యాంక్ వాయేజ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డు వార్షిక రుసుము రూ. 2,000గా ఉంది.  అయితే ఈ కార్డు ఆమోదం పొందిన 30 రోజుల్లోపు రెండు లావాదేవీలను పూర్తి చేస్తే రూ. 4,000 విలువైన స్పైస్‌జెట్ ఈ-వోచర్లను పొందవచ్చు. అలాగే రూ. 7,500 విలువైన కాంప్లిమెంటరీ స్పైస్‌జెట్ యాడ్-ఆన్ వోచర్‌లు పొందవచ్చు. కార్డ్ ఆమోదంపై కాంప్లిమెంటరీ స్పైస్‌క్లబ్ గోల్డ్ సభ్యత్వాన్ని పొందవచ్చు. గరిష్టంగా 28 స్పైస్‌క్లబ్ పాయింట్‌లను పొందవచ్చు. అలాగే ప్రతి త్రైమాసికంలో చేసిన రూ.50 వేల ఖర్చుపై ఎనిమిది కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ సందర్శనలను పొందవచ్చు. 

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..