- Telugu News Photo Gallery Business photos Now Get Health Insurance With Only 2 Rs Monthly Premium, You Can Get 2 Lakhs Coverage
Health Insurance: ఏడాదికి కేవలం రూ.20లకే ఆరోగ్య బీమా..లక్షల రూపాయల కవరేజీ.. మోడీ సర్కార్ అద్భుతమైన పాలసీ
ఆధునిక కాలంలో రోగాల బెడద ఎక్కువైంది. చికిత్స ఖర్చు కూడా పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఆరోగ్య బీమా తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఆనారోగ్యం తలెత్తి ఆస్పత్రికి వెళ్లినట్లయితే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇలాంటి సమయంలో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు..
Updated on: May 27, 2024 | 9:05 PM

ఆధునిక కాలంలో రోగాల బెడద ఎక్కువైంది. చికిత్స ఖర్చు కూడా పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఆరోగ్య బీమా తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఆనారోగ్యం తలెత్తి ఆస్పత్రికి వెళ్లినట్లయితే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇలాంటి సమయంలో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

ఇప్పుడు చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ఆదాయం కాస్త తక్కువగా ఉన్న వారు కావాలనుకున్నా బీమా పొందలేరు. కానీ ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు. ఆరోగ్య బీమాతో ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా సులభంగా గట్టెక్కవచ్చు.

సామాన్య ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు భారత ప్రభుత్వం అద్భుతమైన బీమా పథకాలతో ముందుకు వచ్చింది. ఈ పథకం కింద నెలకు కేవలం 2 రూపాయలు లేదా సంవత్సరానికి 20 రూపాయలతో ఆరోగ్య బీమా పొందవచ్చు. ఈ బీమాలో మీరు 2 లక్షల రూపాయల వరకు కవరేజీని పొందవచ్చు.

ఈ బీమా పథకం ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన. భారత ప్రభుత్వం 2016 నుండి ఈ బీమా పథకాన్ని ప్రారంభించింది. మీరు ఏ బ్యాంకు నుండి అయినా ఈ పథకాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు బ్యాంకును సంప్రదించాలి.

బ్యాంకులు కూడా ఈ సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. ఈ ఆరోగ్య బీమా కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ఖాతాను మూసివేస్తే లేదా ఏదైనా కారణం చేత ఖాతా మూసివేయబడినట్లయితే, పాలసీ కూడా రద్దు చేస్తారు.




