Mother Milk Sale: తల్లిపాలు అమ్మవచ్చా? ఆహార నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు
ఆహార నియంత్రణ సంస్థ FSSAI తల్లి పాల విక్రయాలకు వ్యతిరేకంగా ఆహార వ్యాపార నిర్వాహకులను హెచ్చరించింది. మానవ పాలను ప్రాసెస్ చేయడానికి, విక్రయించడానికి అనుమతిని జారీ చేయవద్దని లైసెన్సింగ్ అధికారులను ఆదేశించింది. కొన్ని సంస్థలు బహిరంగ మార్కెట్‌లో తల్లి పాలను విక్రయిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది...

ఆహార నియంత్రణ సంస్థ FSSAI తల్లి పాల విక్రయాలకు వ్యతిరేకంగా ఆహార వ్యాపార నిర్వాహకులను హెచ్చరించింది. మానవ పాలను ప్రాసెస్ చేయడానికి, విక్రయించడానికి అనుమతిని జారీ చేయవద్దని లైసెన్సింగ్ అధికారులను ఆదేశించింది. కొన్ని సంస్థలు బహిరంగ మార్కెట్‌లో తల్లి పాలను విక్రయిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అనుమతి లేదు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తల్లి పాలు, దాని ఉత్పత్తుల అనధికారిక వాణిజ్యీకరణ’పై ఒక సలహాను జారీ చేసింది. అటువంటి విక్రయాలను అనుమతించేది లేదని కూడా తెలిపింది. ఈ విషయంలో FSS చట్టం 2006, దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మానవ పాలను ప్రాసెస్ చేయడానికి, లేదా విక్రయించడానికి FSSAI అనుమతించలేదని గమనించాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా కమిషనర్‌లకు జారీ చేసిన సలహాలో తల్లి పాలు, దాని ఉత్పత్తులను వాణిజ్యీకరించడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని తెలిపింది.
ఏదైనా ఉల్లంఘన FSS చట్టం, 2006, దాని కింద రూపొందించిన నియమాలు, నిబంధనల ప్రకారం FBOలు (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు)పై చర్య తీసుకోవడానికి దారితీయవచ్చని రెగ్యులేటర్ తెలిపింది.
లైసెన్సింగ్
ఇంకా FSSAI రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అధికారులను తల్లి పాలు ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొన్న అటువంటి ఎఫ్‌బీవోలకు ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ మంజూరు చేయలేదని నిర్ధారించాలని కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




