Rs 2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత రూ.2,000 నోటు చెల్లుబాటవుతుందా? ఆర్బీఐ ఏం చెప్పింది!
రూ 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం..
రూ 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం తెలిపింది. 2016 నోట్ బ్యాన్ నేపథ్యంలో చాలా మంది ఆందోళన చెందారు. దీనికి ఊతం ఇచ్చేలా సెప్టెంబరు 30 తర్వాత రూ .2000 నోటు చెల్లదని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2000 నోటు వ్యవహారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం, సెప్టెంబరు 30 తర్వాత కూడా నోట్ చట్టబద్ధంగా కొనసాగుతుందని పేర్కొంది.
సెప్టెంబర్ 30 తర్వాత రూ .2000 నోటు ఏమవుతుంది ?
రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవడంతో పాటు ఈ నోట్ల డిపాజిట్‌కు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇవ్వడమే గందరగోళానికి కారణం. అయితే సెప్టెంబర్ 30 తర్వాత ఈ నోటు చెల్లదని ఆర్బీఐ ఎక్కడా చెప్పలేదు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా నోటు చెల్లుబాటులో కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అయితే ఆ గడువులోగా రూ .2000 నోటును ఎవరైనా డిపాజిట్ చేయకుండా తమ బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే ఏం జరుగుతుందనేది ప్రశ్న. దీనిపై ప్రభుత్వం కానీ, ఆర్బీఐ కానీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో రూ.2000 నోట్లను కలిగి ఉన్నవారు భయాందోళనకు గురికావాల్సిన పనిలేదు .
రూ.2000 నోటును చెలామణి నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు ? కారణం ఏమిటి ?
2016లో ప్రభుత్వం రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు దేశంలో కరెన్సీ కొరత రాకుండా ఉండేందుకు రూ.2000 నోటును ముద్రించారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో కొత్త రూ.500 నోట్లను ముద్రించారు. దీంతో రూ .2000 నోట్ల అవసరం తగ్గింది. 2018-19లోనే రూ.2000 నోట్ల ముద్రణను ప్రభుత్వం నిలిపివేసింది. సాధారణ ప్రజలకు కూడా రూ 2000 నోట్లు అవసరం లేదు. అలాగే, ఆ నోట్ల చెలామణి కారణంగా చిల్లర సమస్య కూడా చిరు వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.
దీనికి తోడు, UPI ఇప్పుడు మరింత విస్తృతంగా ఉన్నందున రూ. 2,000 నోట్ల అవసరం కూడా తగ్గిపోయింది. 2000 రూపాయల నోటు ముద్రణను ప్రభుత్వం నిలిపివేసినప్పుడే ఈ నోటును వెనక్కి తీసుకోవచ్చని భావించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి