AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office TD: అతి తక్కువ సమయంలోనే మీ డబ్బులు డబుల్.. కేవలం రూ. 5లక్షల పెట్టుబడితో పది లక్షలు సంపాదించే అవకాశం..

భద్రత, అధిక రాబడి ఆశించే వారికి పోస్ట్ ఆఫీసు స్కీమ్స్ మంచి ఆప్షన్స్. ప్రభుత్వం భరోసాతో పాటు అధిక రాబడిని పోస్ట్ ఆఫీసు పథకాలు అందిస్తాయి. మీ పెట్టుబడిని డబుల్ రాబడినిచ్చే పథకాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో టైం డిపాజిట్ స్కీమ్ ఒకటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Post Office TD: అతి తక్కువ సమయంలోనే మీ డబ్బులు డబుల్.. కేవలం రూ. 5లక్షల పెట్టుబడితో పది లక్షలు సంపాదించే అవకాశం..
Post Office Scheme
Madhu
|

Updated on: May 21, 2023 | 4:00 PM

Share

భద్రత, అధిక రాబడి ఆశించే వారికి పోస్ట్ ఆఫీసు స్కీమ్స్ మంచి ఆప్షన్స్. ప్రభుత్వం భరోసాతో పాటు అధిక రాబడిని పోస్ట్ ఆఫీసు పథకాలు అందిస్తాయి. మీ పెట్టుబడిని డబుల్ రాబడినిచ్చే పథకాలు కూడా చాలా ఉన్నాయి. సులభ వాయిదాలలో రూ. 5లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 10లక్షలు సంపాదించొచ్చు. అది కూడా కేవలం పదేళ్లలోనే ఈ రాబడి వస్తుంది. ఇది పోస్ట్ ఆఫీసు పథకాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ పథకం పేరు పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్. దీనిలో కాంపౌండ్ ఇంటరెస్ట్ వస్తుంది. కాబట్టి పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

7.5శాతం వడ్డీ రేటు..

2023, ఏప్రిల్ 1 నుంచి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పై వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. పోస్ట్ ఆఫీసులో ఈ ఖాతా ప్రారంభించిన వారికి వడ్డీ రేటు 7.5శాతం వస్తుంది. ఒకవేళ దీనిలో మీరు రూ. 5లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి మీరు రూ. 7,24,974 పొందుతారు. దీనిలో మీరు వడ్డీగా రూ. 2,24,974 పొందినట్లు లెక్క.

పదేళ్లలో డబ్బులు డబుల్..

మీరు మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్ల నుంచి మరో ఐదేళ్లు పెంచి 10 ఏళ్లకు కొనసాగిస్తే ఆ డబ్బులు మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీనే రూ. 5,51,175 ఉంటుంది. కాబట్టి పదేళ్లలో మీ డబ్బులు డబుల్ అవడం మాత్రం ఖాయం.

ఇవి కూడా చదవండి

100 గుణిజాలలో పెట్టుబడి పెట్టొచ్చు..

ఈ పోస్ట్ ఆఫీసు పథకంలో మీరు రూ. 100 పెట్టుబడి పెట్టొచ్చు. దీనిలో గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రతి క్వార్టర్ కు దీని వడ్డీ రేటును సవరిస్తుంది.

టైం డిపాజిట్ ప్రత్యేకతలివి..

  • ఈ పథకంలో పదేళ్లకు పైబడిన వారు ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ మైనర్ పేరున ఖాతా ప్రారంభించాలనుకుంటే సంరక్షకులుగా తల్లిదండ్రులు ఉంటారు.
  • సింగిల్ గా లేదా జాయింట్ గా ఖాతాను ప్రారంభించవచ్చు.
  • కనీసం 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
  • దీనిలో మీరు ఏడాదికి లేదా రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లకు ఒకసారి పెట్టుబడి పెట్టొచ్చు. ఒక ఏడాదికి అయితే 6.8 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్లకు అయితే 6.9, మూడేళ్లకు అయితే 7.0శాతం, ఐదేళ్లకు అయితే 7.6శాతం వడ్డీ రేటు వస్తుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్..

ఈ పోస్ట్ ఆఫీసు పథకంలో మీకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఫిక్స్ డ్ డిపాజిట్ పై మెచ్యూరిటీ సమయానికి వచ్చే మొత్తంపై ట్యాక్స్ వసూలు చేస్తారు. కాబట్టి ఎఫ్ డీ కన్నా టైం డిపాజిట్ ఈ రకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు