AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గడానికి కారణం ఏంటి.. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే..

మనకు వచ్చే క్రెడిట్ రిపోర్టును చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మన ఆర్థిక నిర్వహణలో లోపం ఎక్కడ ఉందో వెతకాలి. అప్పుడే మనం మన సంతోషకరమైన సమయాలను అనుభవించవచ్చు.

Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గడానికి కారణం ఏంటి.. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే..
Credit Score
Sanjay Kasula
|

Updated on: May 21, 2023 | 1:33 PM

Share

క్రెడిట్ స్కోర్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటే తిరిగి పంజుకోవడం చాలా కష్టం. అందుకే క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడు తప్పులు సరిదిద్దుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎలాంటి తప్పులు జరుగుతాయి. అలాంటి సమయంలో ఏ సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీరు ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయితే ఈ సమస్య మీకు చక్కగా అర్థమవుతుంది. మంచి జీతం వస్తుంటుంది. అయినప్పటికీ  కొంత డబ్బు అవసరం. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుంటాం. దీంతో మీరు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నందున బ్యాంక్ దరఖాస్తును తిరస్కరించింది. ఇంతకీ అప్పులన్నీ తీర్చిన మీకు క్రెడిట్ స్కోర్ ఎందుకు తక్కువగా ఉందో అర్థం కాదు.

క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి నివేదికలు తీసుకుంటే.. గత కొన్ని నెలలుగా స్కోర్లు తగ్గుతున్న సంగతి తెలిసిందే. వీరి పేరుతో సంబంధం లేని రుణ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు మీకు ఆ విషయం కాదు. ఇలాంటి సమస్య మనలో చాలా మందికి ఎదురయ్యే సమస్య. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. అయితే రిపోర్టు ఎలా ఉంటే మంచిదో ఇప్పడు అర్థం చేసుకుందాం..

  • సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్ 750 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే అది మంచి స్కోర్. అలాంటి వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి. మంచి స్కోర్‌కు వడ్డీ రేట్లపై రాయితీ లభిస్తుంది.
  • మీరు రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నారని భావించండి. అయితే, రుణదాత ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు సరిగ్గా నివేదించలేదు. అతను దానిని ‘ఆలస్య చెల్లింపు’గా సూచించాడని అనుకుందాం. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. చెల్లింపులో జాప్యం లేనప్పుడు మీరు ఈ విషయాన్ని రుణదాత దృష్టికి తీసుకురావాలి. నివేదికను సరిచేయమని అడగండి.
  • మీ పేరు, చిరునామా, పాన్ మొదలైన వాటిలో తప్పులు లేదా అక్షరదోషాలు లేవని నిర్ధారించుకోండి. మీ పేరు లేదా ఇతర వివరాలలో ఏదైనా తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించండి. దీంతో స్కోరు తగ్గకపోవచ్చు. కానీ, మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు, మీ డాక్యుమెంట్లు సరిగ్గా లేనప్పుడు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
  • గృహ, వాహన రుణాలు తీసుకున్నవారు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు రుణాలను బదిలీ చేయడం సహజం. అటువంటి సందర్భాలలో రెండు స్థానాల్లో బకాయిలు ఉన్నట్లు రిపోర్టు చూపవచ్చు. అటువంటి సందర్భాలలో, మీ పాత బ్యాంకును సంప్రదించండి. రుణం చెల్లించినట్లు క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయమని వారిని అడగండి.
  • కొన్నిసార్లు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో మరొక వ్యక్తి తీసుకున్న రుణ వివరాలు కనిపించవచ్చు. పేర్లు, చిరునామా, పాన్‌లో తప్పుల వల్ల ఈ విషయాలు జరుగుతాయి. మీ క్రెడిట్ రిపోర్టులో అలాంటి తప్పులు కనిపిస్తే, వెంటనే సంబంధిత బ్యాంకు దృష్టికి తీసుకురండి. క్రెడిట్ బ్యూరోలకు కూడా తెలియజేయండి.
  • బ్యాంకులు క్రెడిట్ కార్డులపై పరిమితులను పెంచుతాయి. అయితే, ఈ విషయాన్ని బ్యూరోలకు తెలియజేయలేదు. మీరు కొత్త పరిమితి వరకు కార్డ్‌ని ఉపయోగించారని అనుకుందాం. మీరు ఎక్కువగా ఉపయోగించినప్పుడు స్కోర్ తగ్గవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ ఖాతా వివరాలలో అలాంటి తప్పులు ఉంటే, వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. చెల్లింపులు సరిగ్గా నమోదు చేయబడాయో లేదో తనిఖీ చేయండి.మీ నివేదికలోని ప్రతి వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించకండి. వెంటనే సంబంధిత బ్యాంక్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్/క్రెడిట్ బ్యూరోని సంప్రదించి సరిదిద్దండి. కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి మీ క్రెడిట్ రిపోర్ట్‌ని చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం