AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Imports From Israel: ఇజ్రాయెల్ నుంచి భారత్‌ ఏ వస్తువును దిగుమతి చేసుకుంటుంది? వ్యాపార సంబంధాలు ఏమిటి?

వ్యాపార రంగంలో మంచి బంధాన్ని ఏర్పర్చుకుంది. అందుకే ఇతర దేశాలు కూడా మన దేశానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఇజ్రాయెల్ , హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. వరుసగా రెండు రోజులుగా సాగుతున్న ఈ వార్ ప్రభావం ఇప్పుడు భారత మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఈరోజు ఈ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా వారంలోని..

India Imports From Israel: ఇజ్రాయెల్ నుంచి భారత్‌ ఏ వస్తువును దిగుమతి చేసుకుంటుంది? వ్యాపార సంబంధాలు ఏమిటి?
India Imports From Israel
Subhash Goud
|

Updated on: Oct 09, 2023 | 7:33 PM

Share

మన భారతదేశం ఇతర దేశాల నుంచి రకరకాల ప్రోడక్స్ట్‌ను దిగుమతి చేసుకుంటోంది. అలాగే మన దేశం నుంచి కూడా ఇతర దేశాలు రకరకాల వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌ పలు దేశాలతో మంచి సత్సంబంధాలు మెరుగు పర్చుకుంది. వ్యాపార రంగంలో మంచి బంధాన్ని ఏర్పర్చుకుంది. అందుకే ఇతర దేశాలు కూడా మన దేశానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఇజ్రాయెల్ , హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. వరుసగా రెండు రోజులుగా సాగుతున్న ఈ వార్ ప్రభావం ఇప్పుడు భారత మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఈరోజు ఈ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా వారంలోని మొదటి మార్కెట్ బాగా దిగువకు ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌తో భారత్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ, భారత్ ఇజ్రాయెల్ నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఆ దిగుమతులపై ఈ యుద్ధం ప్రభావం చూపగలదా?

భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఏమి దిగుమతి చేసుకుంటుందో తెలుసుకుందాం.

ఇజ్రాయెల్ సైనిక పరికరాలను అత్యధికంగా కొనుగోలు ఇజ్రాయెల్ సైనిక పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారతదేశం. రష్యా తర్వాత భారతదేశానికి అత్యధిక సైనిక పరికరాలను సరఫరా చేసే దేశం ఇజ్రాయెల్. 1999 నుంచి 2009 వరకు, రెండు దేశాల మధ్య సైనిక వాణిజ్యం సుమారు US$9 బిలియన్లు. రెండు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలలో ఉగ్రవాద గ్రూపులపై నిఘా భాగస్వామ్యం. అలాగే ఉమ్మడి సైనిక శిక్షణ ఉన్నాయి.

విలువైన రాళ్లు, లోహాల కొనుగోలు:

ఇటీవలి సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యం ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, స్వదేశీ భద్రత వంటి అనేక రంగాలలోకి విస్తరించింది. భారతదేశం ఆసియాలో ఇజ్రాయెల్ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏడవ అతిపెద్దది. భారతదేశం నుంచి ఇజ్రాయెల్‌కు ప్రధాన ఎగుమతులలో విలువైన రాళ్లు, లోహాలు, రసాయన ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇజ్రాయెల్ నుంచి యంత్రాలు, రవాణా పరికరాల కొనుగోలు:

ఇజ్రాయెల్ నుంచి భారతదేశం ప్రధాన దిగుమతులలో విలువైన రాళ్ళు, లోహాలు, రసాయనాలు, ఖనిజ ఉత్పత్తులు, మూల లోహాలు, యంత్రాలు, రవాణా పరికరాలు ఉన్నాయి. భారతదేశం వివిధ దేశాల నుంచి అనేక రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఇజ్రాయెల్ దిగుమతి చేసుకున్న ప్రధాన ఉత్పత్తులలో రసాయన, ఖనిజ ఉత్పత్తులు, విలువైన లోహాలు, రాళ్ళు, మూల లోహాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలు ఉన్నాయి. ఇతర దేశాలలో భారతదేశంలో విస్తృతంగా జనాదరణ పొందిన కొన్ని ఇజ్రాయెలీ ఉత్పత్తుల జాబితా కింద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి