PM Kisan: 21వ విడతకు ముందు 70 లక్షల మంది రైతుల పేర్లను తొలగించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?
PM Kisan Scheme: పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. ఆదాయ పరిమితి పరిధిలోకి రాని రైతులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులు, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందుతున్నవారు..

PM Kisan: లక్షలాది మంది రైతుల ఎన్నో రోజుల నిరీక్షణ ఈరోజుతో ముగిసింది. పీఎం కిసాన్ 21వ విడత రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. తమిళనాడులోని కోయంబత్తూరులో 9 కోట్లకు పైగా రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం PM-KISAN పథకం తదుపరి విడతను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు తదుపరి విడత బదిలీ చేయనున్నట్లు వ్యయవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న తెలిపారు.అయితే ముఖ్యంగా పీఎం కిసాన్ జాబితా నుండి 7 మిలియన్ల మంది రైతుల పేర్లు తొలగించింది కేంద్రం.
PM-Kisan ప్రయోజనాలను ఎలా పొందాలి?
PM-KISAN పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది కేంద్రం.
Investment Formula: రూ.50 వేల జీతంతో 2 కోట్లు ఎలా సంపాదించాలి? అద్భుతమైన ఫార్మూలా!
70 లక్షల రైతుల పేర్లను ఎందుకు తొలగించారు?
21వ విడతకు అర్హులైన రైతుల సంఖ్య దాదాపు 7 మిలియన్లు తగ్గింది. ఈ పథకానికి అనర్హులైన రైతులను గుర్తించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న కఠినమైన ప్రచారం దీనికి కారణం. అనర్హులుగా ఉన్న రైతులను గుర్తించి పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగించింది కేంద్రం. ఈ జాబితా నుంచి సుమారు 70 లక్షల మందిని తొలగించింది.
ఈ పథకానికి ఎవరు అర్హులు కాదు:
పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. ఆదాయ పరిమితి పరిధిలోకి రాని రైతులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులు, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందుతున్నవారు వీరిలో ఉన్నారు. PM-KISAN పథకం ప్రయోజనాలను అర్హత కలిగిన రైతులు మాత్రమే పొందేలా చూడటం కేంద్రం లక్ష్యం.
- ప్రభుత్వ ఉద్యోగులు
- ఎన్నికైన ప్రజాప్రతినిధులు
- నెలకు రూ.10వేల పెన్షన్ పొందేవారు
- రాజ్యంగ పదవుల్లో ఉన్నవారు
- మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, ప్రస్తుత, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఛైర్ పర్సన్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు
- స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న అలాగే మాజీ ఉద్యోగులు
- డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ వంటి నిపుణులు
- ఒకే కుటుంబంలో ఇద్దరు (భార్యాభర్తలు)
ఇలాంటి వ్యక్తులు పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందేందుకు అనర్హులు.
ఇది కూడా చదవండి: SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?
ఇది కూడా చదవండి: Best Bikes: భారత్‌లో 5 చౌకైన బైక్‌లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








