జస్ట్ రూ.100 ఇస్తే చాలు.. మీకు 50 వేలు ఇస్తారు.. ఎక్కడో తెలుసా..?
కేవలం మీరు ఆ దేశంలో రూ.100 ఇస్తే మీకు 50 వేలు ఇస్తారు. ఇది విని ఆశ్చర్యపోతున్నారా.. ? కానీ ఇది అక్షరాలా నిజమే. భారత కరెన్సీకి చాలా దేశాల్లో విలువ తగ్గిపోయినా.. ఆ దేశంలో మాత్రం బాగా పలుకుతోంది. ఇంతకు ఆ దేశం ఏంటి? అక్కడ రూపాయి విలువ ఎందుకు పెరిగింది? అనే విషయాలు తెలుసుకుందాం.

అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా భారత కరెన్సీ రోజురోజుకు పడిపోతుంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపీ విలువ తగ్గుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక సంక్షోభం కారణంగా రూపాయి విలువ తగ్గుతోంది. ఇలాంటి తరుణంలో ఒక రూపాయి విలువ అక్కడ ఏకంగా రూ.500 పలుకుతోంది. అందేంటని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజమే.
రాజకీయ అనుశ్చితి, ఆర్ధిక ఆంక్షల కారణంగా ఇరాన్ కరెన్సీ ప్రపంచంలోనే ప్రస్తుతం అత్యంత తక్కువ విలువ చేస్తోంది. ఆ దేశ చరిత్రలోనే కరెన్సీ ఇంతలా తగ్గడం ఒక రికార్డ్‌గా చెబుతున్నారు. ఇరాన్ కరెన్సీని ఇరానియన్ రియాల్‌గా పిలుస్తారు. భౌగోళిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం తగ్గుదల, ఆర్ధిక ఆంక్షలు కారణంగా ఇరాన్‌లో ఈ సంవత్సరం మధ్య నాటికే ఒక ఇండియన్ రూపీ విలువ రూ.490 నుంచి రూ.500 రియాల్స్‌గా ఉంది. నవంబర్ 19 నాటికి ఈ విలువ ఒక రూపీకి 476.01 ఇరానీ రియాల్‌గా ఉంది. అంటే అక్కడ రూ.100కు 50 వేలు ఇస్తారు. ఇప్పుడు మీరు రూ.10 వేలతో ఇరాన్‌కు వెళితే అక్కడ మీరు రాజులా బ్రతకవచ్చన్నమాట. అక్కడ మీరు ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంటే రూ.7 వేలు ఖర్చవుతుంది. అదే మిడ్ రేంజ్ హోటల్లో బస చేస్తే రూ.2 వేలు లేదా రూ.4 వేలు ఉంటుంది.
ప్రపంచంలోనే ఇరాన్ ఎక్కువగా ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ కొన్నేళ్లుగా అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ ఎకానమీ పాతాళానికి పడిపోయింది. దీని కారణంగా ఇతర దేశాలు ఇరాన్ నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేయడం నిలిపివేశాయి. దీంతో 2012 నుంచి ఇరాన్ కరెన్సీ భారీగా తగ్గుతూ వస్తుంది. ఈ పరిస్థితుల్లో ధరలు పెరగడంతో అక్కడ సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇరాన్‌లో యూఎస్ డాలర్‌పై నిషేధం విధించారు. డాలర్ వాడటం అక్కడ నేరంగా పరిగణిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




