AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుత అవకాశం.. కేవలం రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే రూ.3 కోట్లు..

చిన్నపిల్లల కోసం డబ్బులు ఆదా చేయాలనుకునేవారికి ఇప్పటికే చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి రావాలనుకునేవారికి ఒక మంచి ఫండ్ అందుబాటులో ఉంది. అదే ICICI ప్రుడెన్షియల్ చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్‌. ఇందులో పెట్టుబడి పెడితే పిల్లల భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పుకోవచ్చు.

అద్భుత అవకాశం.. కేవలం రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే రూ.3 కోట్లు..
Icici Mutual Fund
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2025 | 3:18 PM

Share

ICICI Prudential Children’s Plan: పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని ప్రతీఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. తమ విలాసాలను కూడా పక్కన పెట్టి పిల్లల చదువులు, వారి భవిష్యత్తు అవసరాల కోసం పేరెంట్స్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడవద్దని వారి కోసం మనీ కూడబెట్టుకుంటూ ఉంటారు. పిల్లల పేరుపై ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం లేదా పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న పోస్టల్ స్కీమ్స్, బ్యాంక్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం పథకాల్లో తల్లిదండ్రులు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. అలాంటివారి కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో పిల్లల కోసం ప్రత్యేక ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.

పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చిల్డ్రన్స్ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ICICI ప్రుడెన్షియల్ చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్‌లో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే పిల్లల చదువులు లేదా వారి భవిష్కత్ ప్రణాళికలకు బాగా ఉపయోగపడుతుంది. కేవలం పిల్లల కోసమే  ప్రత్యేకంగా ఈ ఫండ్‌ను రూపొందించారు. ఇందులో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ లేదా పిల్లలు పెద్దవారు అయ్యేవరకు ఏది ముందు అయితే అది ఈ ఫండ్‌కు వర్తిస్తుంది. ఈక్విటీ లేదా డెట్ ఆప్షన్లతో ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

పిల్లలు పుట్టినప్పుడు రూ.10 లక్షలు ఈ ఫండ్‌లో పెట్టుబడి పెడితే.. వారికి 24 సంవత్సరాలు వచ్చినప్పుడు రూ.3 కోట్ల వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఉదాహరణకు ఆగస్ట్ 31,2001న రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. అది క్రమక్రమంగా పెరుగుతూ అక్టోబర్ 31,2025 నాటికి రూ.3.3 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది.  ఈ ఫండ్ 15.58% వార్షిక రాబడిని రాబడుతుంది. తల్లిదండ్రులు ఎంత త్వరగా పిల్లలు పుట్టిన వెంటనే ఈ ఫండ్‌లో చేరితే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. పిల్లలు ఉన్నత చదువులకు చేరుకునే సమయానికి ఈ డబ్బులు చేతికి అందుతాయి. ఇంత డబ్బు చేతికి అందాలంటే ఆర్ధిక క్రమశిక్షణ, నెలవారీ పెట్టుబడి తప్పనిసరిగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి