Bank Loans: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే EMI ఎవరు కట్టాలి..? ఇవి తప్పక తెలుసుకోండి..
ఈ మధ్య లోన్స్ తీసుకోవడం అనేది కామన్‌గా మారింది. లోన్ రకాన్ని బట్టి బ్యాంకులు, సంస్థలు బకాయిల్ని వసూల్ చేస్తాయి. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ ఎవరు కట్టాల్సి ఉంటుందనే దానిపై చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు.. టక్కున గుర్తొచ్చేది లోన్. బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్స్ తీసుకోవడం ఈ మధ్య కామన్‌గా మారింది. ప్రస్తుత కాలంలో లోన్ తీసుకోని వారు ఉండడం చాలా తక్కువ. ఈ మధ్య గ్రామాల్లోనూ హోమ్ లోన్స్ తీసుకోవడం పెరిగింది. గతంలో గ్రామాల్లో బ్యాంకులు, సంస్థలు హోమ్ లోన్స్ ఇచ్చేవి కావు. కాగా సిబిల్ స్కోర్‌ను బట్టి బ్యాంకులు వడ్డీని వసూల్ చేస్తుంటాయి. కానీ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? రుణం రద్దు చేస్తారా..? లేక మరొకరు కట్టాల్సి ఉంటుందా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బ్యాంకులు లోన్ రకాన్ని బట్టి రుణ బకాయిలను వసూలు చేస్తాయి. మరణించిన వ్యక్తి కుటుంబానికి హోమ్ లోన్ బకాయిలను చెల్లించడంలో సహాయం చేయడానికి బ్యాంకులకు కొన్ని షరతులు ఉంటాయి. కానీ పర్సనల్ లోన్స్ విషయంలో రూల్స్ మరోలా ఉంటాయి.
పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..?
పర్సనల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ అన్‌సెక్యూర్డ్ రుణాల జాబితాలోకి వస్తుంది. ఒక వ్యక్తి వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ ఖాతాపై చెల్లింపులు చేయకుండా మరణిస్తే, బ్యాంకు ఆ వ్యక్తి కుటుంబం లేదా గ్యారెంటర్‌ను లోన్ చెల్లించమని అడగదు. లోన్ అన్‌సెక్యూర్డ్ కాబట్టి ఇతరుల నుంచి రికవరీ చేయలేరు.
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..?
హోమ్ లోన్‌కు సంబంధించి అప్లికెంట్‌తో పాటు కో అప్లికెంట్ ఉంటాడు. రుణగ్రహీతలలో ఒకరు మరణిస్తే, మొత్తాన్ని తిరిగి చెల్లించే బాధ్యత మరొక వ్యక్తిపై ఉంటుంది. లోన్ తీసుకున్న వ్యక్త మరణిస్తే.. ఆ సమాచారాన్ని కో అప్లికెంట్ బ్యాంకులకు తెలియజేయాలి. దీనితో మరణించిన వ్యక్తి పేరుపై నుంచి లోన్‌ను తొలగిస్తారు. లోన్‌కు లింక్ అయి ఉన్న అకౌంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కో అప్లికెంట్ పేరు మీదకు లోన్ ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇన్సూరెన్స్ ఉంటే నో ప్రాబ్లమ్..?
హోమ్ లోన్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడు లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. దీంతో కో అప్లికెంట్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్సనల్ లోన్స్‌కు ఇటువంటి ఆప్షన్స్ చాలా తక్కువ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




