AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-Kisan: పీఎం కిసాన్‌ డబ్బులు ఇంకా రాలేదా? ఇలా చేయండి.. ఖాతా వివరాలు ఇట్టే తెలిసిపోతాయ్‌..

ఈ ఏడాదికి సంబంధించి మూడో విడతగా రూ. 2000 నగదును గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ప్రధాన మంత్రి తన జార్ఖండ్ పర్యటన సందర్భంగా ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులకు రూ.18,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేశారు. అయితే ఈ నగదు చాలా మంది ఖాతాల్లో ఇంకా జమకాలేదు. అలాంటి ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? తెలుసుకుందాం రండి..

PM-Kisan: పీఎం కిసాన్‌ డబ్బులు ఇంకా రాలేదా? ఇలా చేయండి.. ఖాతా వివరాలు ఇట్టే తెలిసిపోతాయ్‌..
Pm Kisan
Madhu
| Edited By: |

Updated on: Dec 04, 2023 | 8:18 PM

Share

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం-కిసాన్‌) పథకం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినది. దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏటా మూడు దఫాలుగా మొత్తం రూ. 6,000 నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమచేస్తోంది. 2019 ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు దీని ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి మూడో విడతగా రూ. 2000 నగదును గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ప్రధాన మంత్రి తన జార్ఖండ్ పర్యటన సందర్భంగా ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులకు రూ.18,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేశారు. అయితే ఈ నగదు చాలా మంది ఖాతాల్లో ఇంకా జమకాలేదు. అలాంటి ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? తెలుసుకుందాం రండి..

పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ అందకపోతే..

పిఎం-కిసాన్ కింద వాయిదాలు అందుకోని అర్హులైన రైతులు పీఎం-కిసాన్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకూ అందుబాటులో ఉంటుంది.

  • ఫిర్యాదులను pmkisan-ict@gov.in, pmkisan-funds@gov.in ఈమెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
  • ప్రత్యామ్నాయంగా, రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్‌కు 155261 / 011-24300606 లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800-115-526కు కూడా సంప్రదించవచ్చు.
  • మీరు ఆన్‌లైన్‌లో https://pmkisan.gov.in/Grievance.aspxలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.
  • అందుకోసం మీరు మీ ఆధార్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ‘గెట్‌ డిటైల్స్‌’పై క్లిక్ చేయాలి.
  • పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రత్యేకమైన 4-నెలల వ్యవధిలో సంబంధిత రాష్ట్ర/UT ప్రభుత్వాలు PM-కిసాన్ పోర్టల్‌లో పేర్లను అప్‌లోడ్ చేసిన లబ్ధిదారులు ఆ కాలానికి ప్రయోజనం పొందేందుకు అర్హులు. భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలు, వారి పేర్లపై సాగు చేయదగిన భూమి ఉన్నవారు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. అయితే, నమోదు చేసుకున్న రైతులకు ఈ-కెవైసి తప్పనిసరి. ఈ-కేవైసీ ఎలా చేయాలంటే..

సీఎం కిసాన్ వాయిదా స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయొచ్చు అందుకోసం..

  • అధికారిక పీఎం కిసాన్ https://pmkisan.gov.in/ పోర్టల్‌ని సందర్శించండి.
  • ‘ఫార్మర్స్ కార్నర్’లో, ‘బెనిఫిషియరీ స్టేటస్’పై క్లిక్ చేయండి.
  • క్యాప్చా కోడ్‌తో పాటు మీ ఆధార్ నంబర్, ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • వివరాలను వీక్షించడానికి ‘గెట్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

అయితే ఇక్కడ వివరాలు రావాలంటే మీ పేరు తప్పనిసరిగా లబ్ధిదారుల జాబితాలో ఉండాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి..

  • అధికారిక పీఎంకిసాన్‌ వెబ్‌సైట్‌( https://pmkisan.gov.in/)ను సందర్శించండి.
  • కుడి మూలలో ఉన్న ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామంతో సహా డ్రాప్-డౌన్ నుంచి వివరాలను ఎంచుకోండి.
  • లబ్ధిదారుల జాబితా వివరాలను ప్రదర్శించడానికి ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • అప్పుడు వివరాలన్నీ వస్తాయి. ఆ జాబితాలో ఉంటే పైన స్టేటస్‌ వద్ద కూడా మీ వివరాలుకనిపిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్