Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New EV Scooters: త్వరలో మార్కెట్‌లోకి దూసుకురానున్న ఈవీ స్కూటర్లు ఇవే.. లుక్స్‌తో పాటు ఫీచర్లల్లోనూ ది బెస్ట్‌

పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఏడాది కొత్త మోడల్‌ ఈవీ స్కూటర్లు లాంచ్‌ చేయనున్నారు.ముఖ్యంగా చిన్న బ్యాటరీ ప్యాక్ టీఎఫ్‌స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్లతో పని చేస్తుంది. హోండా, సుజుకి వంటి ప్రధాన కంపెనీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో రాబోయే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

New EV Scooters: త్వరలో మార్కెట్‌లోకి దూసుకురానున్న ఈవీ స్కూటర్లు ఇవే.. లుక్స్‌తో పాటు ఫీచర్లల్లోనూ ది బెస్ట్‌
Ev Scooters
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2023 | 8:22 PM

ఫేమ్‌-2 సబ్సిడీల తగ్గింపుతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్లో మరింత సరసమైన స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఏడాది కొత్త మోడల్‌ ఈవీ స్కూటర్లు లాంచ్‌ చేయనున్నారు.ముఖ్యంగా చిన్న బ్యాటరీ ప్యాక్ టీఎఫ్‌స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్లతో పని చేస్తుంది. హోండా, సుజుకి వంటి ప్రధాన కంపెనీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో రాబోయే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఏథర్‌ 

బెంగళూరుకు చెందిన ఈవీ తయారీదారు ఏథర్‌ అందుబాటులో ఏథర్‌ 450లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా ప్రస్తుత 450 శ్రేణి కంటే ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా చేసిన ట్వీట్ ప్రకారం ఈ స్కూటర్ 2024 ప్రథమార్థంలో విడుదల అవుతుంది. ముఖ్యంగా టీవీఎస్‌ ఐక్యూబ్‌కు పోటీగా ఈ సరికొత్త స్కూటర్‌ లాంచ్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

సింపుల్ డాట్ వన్

సింపుల్ ఎనర్జీ అనేది తమిళనాడులో ఉన్న మరొక స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రజాదరణ పొందాయి. ఇది ఐడీసీ పరిధి 212కిమీ అని కంపెనీ పేర్కొంటుంది. కంపెనీ మొదటి స్కూటర్‌లో దాదాపు 50 యూనిట్లను డెలివరీ చేసింది. ఇప్పుడు దాని రెండో ఉత్పత్తి సింపుల్ డాట్ వన్‌ను మరింత సరసమైన ఆఫర్‌గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. సింపాలే డాట్ వన్ లాంచ్ డిసెంబర్ 15న జరగనుంది.

ఇవి కూడా చదవండి

హోండా యాక్టివా ఈవీ

టీవీఎస్‌, హీరో వంటి ప్రధాన స్రవంతి తయారీదారులు ఇప్పటికే ఈవీ స్పేస్‌లో ఉన్నందున హోండా ఆలస్యమైనప్పటికీ యాక్టివా చేసిన మ్యాజిక్‌ను పూర్తి ఎలక్ట్రిక్ యాక్టివా లాంచ్‌తో మళ్లీ సృష్టించాలని భావిస్తోంది. 2024 ప్రారంభంలో ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ పోటీ ధరలో ఉంటుంది అయితే, ఆ సమయంలో స్కూటర్ గురించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. 

సుజుకి బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్

హోండా ఒక ఈవీ రావడంతో సుజుకి కూడా బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ ఇప్పటికే భారతదేశంలో పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. 2024 మొదటి అర్ధ భాగంలో లాంచ్ జరుగుతుందని భావిస్తున్నారు. లాంచ్ చేసినప్పుడు సుజుకి బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ ధర రూ. 1 లక్ష -షోరూమ్ ధరను కలిగి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..