Bajaj Chetak Urbane: మరోసారి అప్ గ్రేడ్ అయిన బజాజ్ చేతక్.. లేటెస్ట్ ఎడిషన్ వివరాలు ఇవి..
బజాజ్ తన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే బజాజ్ చేతక్ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు దాని న్యూ వెర్షన్ ను కంపెనీ ఆవిష్కరించింది. బజాజ్ చేతక్ అర్బేన్ పేరిట దానిని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ రూ. 1.15లక్షలు కాగా, టెక్ ప్యాక్ వేరియంట్ రూ. 1.21 లక్షలు ఎక్స్ షోరూం గా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు తమ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్లను అందిపుచ్చుకుంటూ సాధారణ పెట్రోల్ ఇంజిన్ స్కూటర్లకు దీటుగా సేల్స్ రాబడుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో బజాజ్ తన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే బజాజ్ చేతక్ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు దాని న్యూ వెర్షన్ ను కంపెనీ ఆవిష్కరించింది. బజాజ్ చేతక్ అర్బేన్ పేరిట దానిని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ రూ. 1.15లక్షలు కాగా, టెక్ ప్యాక్ వేరియంట్ రూ. 1.21 లక్షలు ఎక్స్ షోరూం గా ఉంది. దీనిలో అడ్వాన్స్ డ్ ఫీచర్లతో పాటు డీసెంట్ స్టైల్, పనితీరును అధికంగా కనబరుస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బజాజ్ చేతక్ అర్బేన్ రేంజ్..
ఈ స్కూటర్లో ప్రత్యేకత ఏంటంటే అధికమైన రేంజ్ అని చెప్పాలి. బజాజ్ వెబ్ సైట్ ప్రకారం అర్బేన్ రేంజ్ సింగిల్ చార్జ్ పై 113 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న చేతక్ మైలేజీ 108కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ కి ఐడీసీ సర్టిఫికెట్ ఉంది. దీనిలో 2.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.
గరిష్ట వేగం, రైడింగ్ మోడ్స్..
ఈ చేతక్ స్టాండర్డ్ మోడ్లో గరిష్టంగా గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అది కూడా సౌకర్యవంతమైన రైడ్ ను అందిస్తుంది. అదనంగా టెక్ ప్యాక్ అనే ప్రత్యేక రైడింగ్ మోడ్ ను కూడా కంపెనీ అందించింది. ఈ మోడ్లో గరిష్టంగా గంటకు 73కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఇదే స్కూటర్ కి స్పోర్ట్ మోడ్ తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
చార్జింగ్ టైం..
ఈ చేతక్ అర్బేన్ చార్జర్ సామర్థ్యాన్ని 800వాట్ల నుంచి 650వాట్లకు తగ్గించింది. ఫలితంగా చార్జింగ్ టైం పెరుగుతోంది. దీనిలో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి నాలుగు గంటల 50 నిమిషాల సమయం పడుతుంది.
ధర, లభ్యత..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్రూక్ లైన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్, సైబర్ వైట్, మ్యాటీ కోర్స్ గ్రే వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే స్టాండర్డ్ మోడల్ రూ. 1.15లక్షలు కాగా, టెక్ ప్యాక్ వేరియంట్ రూ. 1.21 లక్షలు ఎక్స్ షోరూం గా ఉంది. మహిళలు, పురుషులు ఎవరైనా దీనిని వినియోగించుకోవచ్చు. కంపెనీ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..